Jajula Srinivas Goud Shocking Comments : బీసీల సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

Hello Telugu - Jajula Srinivas Goud Shocking Comments

Hello Telugu - Jajula Srinivas Goud Shocking Comments

Jajula Srinivas Goud : హైద‌రాబాద్ – ప్రపంచ చరిత్రలో సాంస్కృతిక ఉద్యమం లేకుండా ఏ ఉద్యమం విజయవంతం కాలేదని, నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి నేటి తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం వరకు కవులు, కళాకారులు, రచయితలు సాంస్కృతిక సేనగా ఏర్పడి ఉద్యమిస్తేనే ఉద్యమాలు విజయం సాధించాయని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో జరిగే బీసీల రాజకీయ పోరాటానికి సాంస్కృతిక ఉద్యమం తోడు అయితే ఇక వచ్చేది బీసీల రాజ్యమేనని స్ప‌ష్టం చేశారు. ఇది ఎవరు ఆపలేరని పేర్కొన్నార‌.

Jajula Srinivas Goud Key Comments

హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ కళాకారుల ఆత్మీయ కలయిక పేరుతో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు, ఈ ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కవులు కళాకారులు తరలివచ్చి బిసి కల్చరల్ ఫోరం వేదికను ఏర్పాటు చేశార. ఈ సమావేశానికి జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud) తో పాటు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్ అనిల్, మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్ లు పాల్గొన్నారు .

ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud) మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రంలోని బీసీ కళాకారులు, కవులు సామాజిక దోపిడీ అసమాన తలపై, అలాగే ప్రాంతీయ వివక్ష పై తమ కలం ద్వారా, గ‌ళం ద్వారా పోరాడారని దీనితో తెలంగాణలో సామాజిక రాజకీయ చైతన్యంతో పాటు ప్రత్యేక రాష్ట్ర సాధన కూడా జరిగింద‌న్నారు. బీసీ కవులు, కళాకారులు అంతా ఏకధాటిగా ముందుకు వచ్చి పార్టీ జెండాలను, ఎజెండాలను పక్కకు పెట్టి బీసీల భావజాల వ్యాప్తినీ పల్లె పల్లెకు తీసుకెళ్లి బీసీ ఉద్యమ చరిత్రను తిరగ రాయాలని, బీసీల రాజకీయ పోరాటంలో కోట్లాదిమందిని భాగస్వామ్యం చేయాలని కళాకారులకు జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud) పిలుపునిచ్చారు .

బీసీ క‌ళాకారుల సంస్థ రాష్ట్ర అధ్యక్షులుగా వరంగల్ శ్రీనివాస్ , రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులుగా
కోదారి శ్రీను, ఉపాధ్యక్షులుగా అంబ‌టి వెంక‌న్న‌, అభిన‌య శ్రీ‌నివాస్ , ప్రధాన కార్యదర్శిగా దరువు అంజన్న , కోశాధికారిగా బీసీ రామలింగం, సంయుక్త కార్యదర్శిలుగా మ‌ళ్లిక్ తేజ‌, బుర్ర స‌తీష్, ప్ర‌కాశ్ , ప్ర‌చార కార్య‌ద‌ర్శులుగా పొద్దు పొడుపు శంక‌ర్, రాచకొండ ర‌మేష్, రాచ‌కొండ రంగ‌న్న‌, సాంస్కృతిక కార‌య‌ద‌ర్శులుగా వ‌డ్ల‌కొండ అనిల్, జ‌డ‌ల ర‌మేష్, జీవై కృష్ణ‌, స‌హాయ కార్య‌ద‌ర్శులుగా మ‌ధు ప్రియ‌, మామిళ్ల మౌనిక‌, ప‌ర‌కాల అజ‌య్ , సిద్దిపేట శ్రీ‌నివాస్, ఐల నరసింహ స్వామి ఉన్నారు.

సలహా దారులుగా మోహన్ బైరాగి, ఐలా నరసింహ చార, సిద్దిపేట శ్రీనివాస్, ఒగ్గు రవి, జనగామ సోమేశ్వర్, యోచ‌న ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా న‌క్క శ్రీ‌కాంత్, రాంసాగ‌ర్ ల‌క్ష్మ‌ణ్, ముకుంద‌, మామిళ్ల మౌనిక‌, ప‌ద్మావ‌తి ని ఎంపిక చేశారు. సాంస్కృతిక కార్య‌ద‌ర్శులుగా స్వామి డప్పు, సంబరాల బాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

ఈ సమావేశంలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, శేఖర్ సగర, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, విక్రమ్ గౌడ్, శ్యాం కుర్మా, తారకేశ్వరి, సుజాత, తదితరులు పాల్గొన్నారు .

Also Read : CM Chandrababu – AP Ports Growth : ఏపీ పోర్టుల అభివృద్ధికి సింగపూర్ మోడల్

Exit mobile version