Dipankar Bhattacharya-Bihar Victory : బీహార్ లో ఎన్డీయే విక్ట‌రీ అంతులేని మిస్ట‌రీ

సీపీఐఎంఎల్ నేత దీపాంక‌ర్ భ‌ట్టాచార్య

Hello Telugu - Dipankar Bhattacharya-Bihar Victory

Hello Telugu - Dipankar Bhattacharya-Bihar Victory

Dipankar Bhattacharya : ఢిల్లీ : బీహార్ రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మి భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. గ‌తంలో కంటే ఎక్కువ‌గా సీట్ల‌ను కైవ‌సం చేసుకుంది. కాంగ్రెస్ , ఆర్ఎల్డీ పార్టీలు అడ్ర‌స్ లేకుండా పోయాయి. దీంతో మ‌హా ఘ‌ట్ బంధ‌న్ కూట‌మికి తీవ్ర నిరాశే మిగిలింది. మ‌రోసారి సీఎంగా కొలువు తీర‌నున్నారు నితీశ్ కుమార్. సోమ‌వారం బీహార్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స్పందించారు సీపీఐ ఎంఎల్ నాయ‌కుడు దీపాంక‌ర్ భ‌ట్టాచార్య‌ (Dipankar Bhattacharya). ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇది కేవలం మెజారిటీ కాదు. ఎన్డీఏ దాదాపు 80 శాతం ఓట్లను సాధించిందన్నారు. ఇలాంటి ఫలితం చివరిసారిగా 2010లో కనిపించింది, ఆ సమయంలో నితీష్ కుమార్ ప్రభుత్వం, బీజేపీ, ప్రధాని మోదీతో కలిసి అధికారంలోకి వచ్చింద‌ని అన్నారు దీపాంక‌ర్ భ‌ట్టాచార్య‌.

Dipankar Bhattacharya Comments on Bihar Election Results

అయితే ఇప్పుడు ప్రజలు ప్రభుత్వం పట్ల నిరాశ చెందార‌ని, అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారని చెప్పారు. ఇటువంటి స‌మ‌యంలో ఎన్డీయే కూట‌మి మ‌రోసారి విజ‌యం సాధించ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంద‌ని అన్నారు దీపాంక‌ర్ భ‌ట్టాచార్య‌. మొత్తంగా బీహార్ లో ఎన్డీయే కూట‌మి విక్ట‌రీ అంతులేని మిస్ట‌రీగా మారందంటూ పేర్కొన్నారు. తాజాగా దీపాంక‌ర్ భ‌ట్టాచార్య చేసిన కామెంట్స్ తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇదే విష‌యాన్ని తేజస్వి యాద‌వ్ తో పాటు రాహుల్ గాంధీ సైతం ప్ర‌శ్నించారు. నిల‌దీశారు. మ‌రో వైపు జ‌న్ సురాజ్ పార్టీ చీఫ్‌, ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ సైతం త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఆశా జ‌న‌కంగా లేద‌ని గుర్తించారు.

Also Read : CM Chandrababu Interesting on Ramoji Rao : తెలుగు భాషను కాపాడేందుకు ఏమైనా చేస్తా : సీఎం

Exit mobile version