CM Chandrababu : హైదరాబాద్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు భాష కోసం తాను ఎంత దూరమైనా వెళతానని, ఏమైనా చేస్తానని ప్రకటించారు. ప్రపంచంలోని తెలుగు వారంతా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. వివిధ రంగాలలో కీలకమైన పదవులలో మన వారు ఉన్నారని, ప్రత్యేకించి ఐటీ సెక్టార్ లో టాప్ లో కొనసాగుతున్నారని ఇదంతా తన వల్లనే జరిగిందన్నారు సీఎం. రామోజీ స్ఫూర్తిగా తెలుగు భాష సంరక్షణ కోసం ప్రయత్నిస్తానని చెప్పారు . నాకు ఇది చేయాలని రామోజీరావు ఎవరినీ ఏనాడూ అడగ లేదని అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరిశ్వాస వరకూ పోరాడారని కొనియాడారు. “ఈనాడు” సంస్థల ద్వారా సమాజంపై అపూర్వమైన ప్రభావం చూపిన మహనీయుడు రామోజీరావు అని అన్నారు.
CM Chandrababu Interesting Comments on The Great Ramoji Rao
రామోజీరావు జయంతి సందర్భంగా హైదరాబద్ లోని రామోజీ ఫిలిం సిటీలో రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు గంగాపురం కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ పటేల్, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎం ప్రసంగించారు. రామోజీ రావు ప్రస్థానం పచ్చళ్లతో ప్రారంభమై మీడియా మొఘల్ గా మారేలా చేసిందన్నారు. వేలాది మందికి ఆయన పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉపాధి కల్పించారని కొనియాడారు.
Also Read : CM Revanth Reddy Interesting Comments : రామోజీ రావు పేరు కాదు ఓ బ్రాండ్ : సీఎం
