ముంబై : భారతదేశ సినీ చరిత్రలో రికార్డ్ బ్రేక్ చేసింది ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన చిత్రం ధురంధర్. ఈ మూవీ ఇప్పటికే రికార్డుల మోత మోగిస్తోంది. వసూళ్లలో సరికొత్త చరిత్ర సృష్టించింది. భారీ తారాగణం ఇందులో కీలక పాత్రలు పోషించినప్పటికీ ఇద్దరు హీరోలు మాత్రం ఎల్లప్పటికీ గుర్తుండి పోయేలా నటించారు. వారిలో అక్షయ్ ఖన్నాతో పాటు రణ్ వీర్ సింగ్. పాకిస్తాన్ లో ఇండియా గూఢచారి పాత్రను ఆధారంగా చేసుకుని కళ్లకు కట్టినట్లుగా ధురంధర్ సినిమాను అత్యంత సాహసోపేతంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇక ఈ సినిమా ఇప్పటి వరకు విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 550 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది కూడా రికార్డ్.
మరో వైపు వసూళ్ల వేట కొనసాగిస్తున్న ధురంధర్ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసేందుకు అంతర్జాతీయ పరంగా పేరు పొందిన ఓటీటీ సంస్థలు నెట్ ఫ్లిక్స్, జియో స్టార్, అమెజాన్ , జీ, తదితర సంస్థలన్నీ పెద్ద ఎత్తున పోటీ పడ్డాయి. కానీ చివరకు ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ. 285 కోట్లకు అమెరికాకు చెందిన దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ స్వంతం చేసుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరో వైపు గతంలో సుకుమార్ దర్శకత్వం వహించిన అల్లు అర్జున్, రష్మిక మందన్నా కలిసి నటించిన పుష్ప -2 మూవీని ఓటీటీ సంస్థ రూ. 275 కోట్లకు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఏ సినిమాకు చెల్లించని ధరను నెట్ ఫ్లిక్స్ ధురంధర్ కోసం ఫోకస్ పెట్టినట్లు టాక్. ఇదే గనుక నిజమైతే సినీ ఇండస్ట్రీలో ఇదే అతి పెద్ద డీల్ గా ఉండి పోతుంది.
https://www.youtube.com/watch?v=n7amONMplak
