ధురంధ‌ర్ సినిమా అద్భుతం : ప్రీతి జింతా

జీవితంలో మ‌రిచి పోలేనంటూ కామెంట్స్

helloteugu-PreityZinta

అమెరికా : ఒక‌ప్ప‌టి బాలీవుడ్ న‌టి, పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కో ఓన‌ర్ ప్రీతి జింతా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను ఇప్పుడే ర‌ణ్ బీర్ క‌పూర్, అక్ష‌య్ ఖ‌న్నా క‌లిసి న‌టించిన ఆదిత్యా ధ‌ర్ తీసిన మూవీ ధురంధ‌ర్ సినిమాను చూశాన‌ని, ఎంత చెప్పినా ఆ సినిమా గురించి తక్కువేన‌ని పేర్కొన్నారు. ప్రీతి జింతా త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ప్ర‌ముఖ సామాజిక మాధ్య‌మాల ద్వారా త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను పంచుకున్నారు. త‌నకు ఇలాంటి సినిమా చేసే అవ‌కాశం రాక పోవ‌డం ప‌ట్ల ఒకింత బాధ‌గా ఉంద‌ని వాపోయింది ఈ ముద్దుగుమ్మ‌.

ధురంధ‌ర్ అంచ‌నాల‌కు మించి ఉంద‌న్నారు. ఈ రోజు చాలా సరదాగా గడిచింది. చాలా కాలం తర్వాత తాను ఒక్క‌దానినే థియేటర్‌లో సినిమా చూశాను. మధ్యాహ్నం షో హౌస్‌ఫుల్ అయింది, వావ్, అదొక అద్భుతమైన అనుభవం అని ప్ర‌శంస‌లు కురిపించింది ప్రీతి జింతా. చాలా కాలంగా నేను చూసిన ఉత్తమ చిత్రాలలో ఇది బహుశా ఒకటి అని స్ప‌ష్టం చేసింది. సహజంగా, వాస్తవికంగా ద‌గ్గ‌ర‌గా ఉంద‌న్నారు. ర‌ణ్ వీర్ సింగ్, సంజ‌య్ ద‌త్, మాధ‌వ‌న్ , అర్జున్ రామ్ ప‌పాల్ , త‌దిత‌ర న‌టులు త‌మ పాత్ర‌ల‌లో లీన‌మై న‌టించార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు ప్ర‌ముఖ న‌టి.

హృదయాన్ని హత్తుకునే, ఉత్కంఠ భరితమైన సంగీతం చాలా నచ్చింద‌ని తెలిపింది. అన్నిటికంటే ఎక్కువ‌గా త‌న‌ను ఆక‌ట్టుకున్న‌ది మాత్రం ఒకే ఒక్క‌రు ద‌ర్శ‌కుడు ఆదిత్యా ధ‌ర్ అని పేర్కొంది ప్రీతి జింతా. ఇది కేవలం ఒక సినిమా కాదు. మన దేశాన్ని రక్షించడానికి ప్రమాదంలో నిలబడిన ప్రతి అజ్ఞాత పురుషుడు, మహిళ, దేశభక్తుడికి ఇది ఒక ప్రేమలేఖ అని తెలిపింది.

Exit mobile version