ఢిల్లీ : ప్రముఖ నటి, భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన సీక్వెల్ మూవీ దురంధర్ -2 మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎవరూ ఊహించని రీతిలో భారతీయ సినిమాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కోట్లాది రూపాయలు వసూలు చేసింది. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. కోట్లు కురుస్తున్నాయి ప్రతి రోజూ. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు, నటీ నటులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సినీ టెక్నీషియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సంచలన, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే ఏకంగా ఈ సినిమా చూడక పోతే వేస్ట్ అన్నాడు.
ఈ సందర్బంగా ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. దురంధర్ -2 ది రివెంజ్ సినిమా చూశానని తెలిపింది. తాను నటిగా ఎన్నో సినిమాలలో నటించినా, ఇలాంటి మూవీని తాను చూడలేదని పేర్కొంది. తాను విస్మయానికి లోనైనట్లు చెప్పింది. ఎంతో గట్స్ ఉంటేనే కానీ ఇలాంటి సినిమా తీసేందుకు ముందుకు రారని, ఈ సందర్బంగా తాను ప్రత్యేకంగా దర్శకుడు ఆదిత్య ధర్ ను అభినందిస్తున్నట్లు చెప్పింది. ఇవాళ కంగనా రనౌత్ మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా దర్శకుడికి దక్కాల్సిన గౌరవం అని స్పష్టం చేసింది నటి. ఏ హీరో కంటే కూడా అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతున్న ఒక “సూపర్‌స్టార్ చిత్ర నిర్మాత” అని ఆమె ఆదిత్యను అభివర్ణించారు.
