DGCA Strong Focus : ఎయిర్ పోర్టులలో భ‌ద్ర‌తా లోపాల‌పై డీజీసీఏ ఫోక‌స్

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన పౌర విమానయాన సంస్థ

hellotelugu-dgca

DGCA : ఢిల్లీ – కేంద్ర విమానయాన సంస్థ (డీజీసీఏ) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. దేశ వ్యాప్తంగా ఎయిర్ పోర్టుల‌లో భ‌ద్ర‌తా వైఫ‌ల్యాల‌పై ఫోక‌స్ పెట్టింది. తాజాగా గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ లో ఎయిర్ ఇండియాకు చెందిన ఫ్లైట్ టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే కూలి పోయింది. ఈ ఘ‌ట‌న‌లో 239 ప్ర‌యాణీకులు, 12 మంది సిబ్బందితో పాటు బీజే హాస్పిట‌ల్ క్వార్ట‌ర్స్ లో ఉన్న 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది అతి పెద్ద సంఘ‌ట‌న ఈ ఏడాదిలో. ఈ ఘ‌ట‌న‌లో మాజీ సీఎం విజ‌య్ రూపాణి కూడా మృతి చెందారు. దీనిపై సీరియ‌స్ అయ్యింది కేంద్రం.

DGCA Focus on Airports Security Lapse

వెంట‌నే విచార‌ణ‌కు ఆదేశించింది. అన్ని ఎయిర్ పోర్టుల‌ను త‌నిఖీ చేయాల‌ని, ఆయా స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ గా ఉన్న పౌర విమాన‌యాన సంస్థ‌ల‌న్నీ భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌ను విధిగా పాటించాల‌ని ఆదేశించింది డీజీసీఏ (DGCA). దీంతో ప‌లు ఎయిర్ పోర్టుల‌లో భ‌ద్ర‌తా లోపాలు ఉన్న‌ట్లు గుర్తించింది. డీజీసీఏ నిర్దేశించిన రూల్స్ ను పాటించ‌డం లేద‌ని తేలింది. దీంతో స‌ద‌రు ఎయిర్ పోర్టుల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేస్తూ భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించాల‌ని లేక పోతే తీవ్ర చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ హెచ్చ‌రించింది.

ప్ర‌ధానంగా త‌నిఖీల‌లో భాగంగా సామాను ట్రాలీవు వంటి గ్రౌండ్ హ్యాండ్లింగ్ ప‌రిక‌రాలు ప‌ని చేయ‌డం లేద‌ని గుర్తించింది. లైన్ నిర్వ‌హ‌ణ షాప్స్, సాధ‌న నియంత్ర‌ణ విధానాలు పాటించ‌డం లేద‌ని పేర్కొంది. దీనికి సంబంధించి కీల‌క వివ‌రాలు వెల్ల‌డించింది ఏవియేష‌న్ వాచ్ డాగ్ . అయితే లోపాలకు సంబంధించి విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు, ఇతర సంస్థల పేర్లను వెల్లడించకుండానే కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. నిఘా విమాన కార్యకలాపాలు, వాయు యోగ్యత, ర్యాంప్ భద్రత, ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ (ATC), కమ్యూనికేషన్, నావిగేషన్ , సర్వైలెన్స్ (CNS) వ్యవస్థలు, ప్రీ-ఫ్లైట్ మెడికల్ మూల్యాంకనాలు వంటి బహుళ కీలక రంగాలను ప‌రిశీలించింది.

Also Read : TTD Interesting News :శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ గుడ్ న్యూస్

Exit mobile version