Hero Rajinikanth Birthday : స్వర్ణోత్సవ సూపర్ స్టార్ రజినీకాంత్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు

Hello Telugu - Hero Rajinikanth Birthday

Hello Telugu - Hero Rajinikanth Birthday

Rajinikanth : అమ‌రావ‌తి – సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పుట్టిన రోజు ఆగ‌స్టు 16 న శ‌నివారం. ఈ సంద‌ర్బంగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ రంగాల‌కు చెందిన సినీ ప్ర‌ముఖులు, నిర్మాత‌లు, టెక్నీషియ‌న్స్ , వివిధ రాజ‌కీయ పార్టీల‌కు చెందిన ప్ర‌ముఖులు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ముఖ న‌టుడు, ప‌వ‌ర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే విషెస్ తెలిపారు. వెండి తెరపై ‘సూపర్ స్టార్ రజిని’ అని టైటిల్ కనిపించగానే థియేటర్ ఏ విధంగా మారు మోగుతుందో పలుమార్లు చెన్నైలో చూశాన‌ని చెప్పారు. తరాలు మారుతున్నా సినీ ప్రియుల్లో ఆ ఆనందోత్సాహాల వన్నె తగ్గలేదన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఆ స్థాయి అభిమానులను దక్కించుకున్న అగ్రశ్రేణి కథానాయకుడు రజినీకాంత్ నటుడిగా అయిదు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవ‌డం మామూలు విష‌యం కాద‌న్నారు.

Rajinikanth Birthday Special

సినీ జీవితంలో స్వర్ణోత్సవం చేసుకుంటున్న సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) గారికి హృదయ పూర్వక అభినంద‌న‌లు తెలియ చేస్తున్నాన‌ని , ఆయ‌న త‌న‌కే కాదు వేలాది మందికి స్పూర్తి దాయ‌కంగా నిలుస్తూ వ‌చ్చార‌ని కొనియాడారు. . ప్రతినాయక పాత్ర పోషించినా, కథానాయకుడిగా మెప్పించినా రజినీకాంత్ తనదైన స్టైల్ ను చూపించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఆయన నడకలో, సంభాషణలు పలకడంలో, హావభావ విన్యాసంలో ప్రత్యేకతను చూపిస్తారని పేర్కొన్నారు. రజినీకాంత్ స్టైల్స్ కి నవతరం ప్రేక్షకుల్లోనూ అభిమానులున్నారు. నటుడిగా శిఖరాగ్ర స్థాయికి చేరిన రజినీకాంత్ మహావతార్ బాబాజీ భక్తుడిగా ఆధ్యాత్మిక విషయాలపై, యోగా సాధనపై ప్రత్యేక శ్రద్ధ చూపడం ఆయనలో భక్తి భావాన్ని, ధార్మిక విశ్వాసాలను తెలియ చేస్తుంద‌న్నారు.

నటుడిగా స్వర్ణోత్సవ సంబరాలు చేసుకుంటున్న రజినీకాంత్ మరిన్ని విభిన్న పాత్రలతో సినీ ప్రియులను మెప్పించాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయ‌న‌కు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అని అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

Also Read : MP Kesineni Chinni Growth : ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎంపీ చిన్ని

Exit mobile version