CM Revanth Reddy : హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రైజింగ్ స్టేట్ గా ముందుకు సాగుతోందని చెప్పారు. ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, టెలికాం తదితర రంగాలకు కేరాఫ్ గా ఉందన్నారు. అంతే కాదు పెట్టుబడులకు ఈ ప్రాంతం అత్యంత అనువైనదని పేర్కొన్నారు. సెక్రటేరియట్‌లో హడ్సన్ ఇన్‌స్టిట్యూట్ నుండి విధాన నిపుణులు, ప్రభావవంతమైన అమెరికన్ వ్యాపారవేత్తలు, ఆలోచనాపరులు, దాతలతో కూడిన అమెరికా ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
CM Revanth Reddy Key Comments
తెలంగాణ తో పాటు రాజధాని హైదరాబాద్ మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామన్నారు. అపారమైన , విస్తృతమైన పెట్టుబడి అవకాశాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు సీఎం. మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ, తయారీలో భాగస్వామ్య అవకాశాల సమృద్ధిని హైలైట్ చేశారు. రాయబారులుగా మారమని వారిని కోరారు రేవంత్ రెడ్డి. టారిఫ్‌లు, వీసాలపై వేగంగా మారుతున్న అమెరికన్ విధాన మార్గదర్శకాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రతినిధి బృందంలో క్రో హోల్డింగ్స్ చైర్మన్ హర్లాన్ క్రో, సివిక్ లీడర్ ట్రస్టీ కేథరీన్ క్రో, వాల్ స్ట్రీట్ జర్నల్ కాలమిస్ట్ ప్రొఫెసర్ వాల్టర్ రస్సెల్ మీడ్, రీసెర్చ్ అసోసియేట్ ఆండ్రూ విల్సన్, ఫెలో డిప్యూటీ డైరెక్టర్ మైఖేల్ వాట్సన్ ఉన్నారు.
హడ్సన్ ఇన్స్టిట్యూట్, విలియం (బిల్) డ్రెక్సెల్, ఈగిల్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ వ్యవస్థాపకుడు కో-CIO రావెనెల్ కర్రీ, అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ ఫెలో మాథ్యూ కాంటినెట్టి, హడ్సన్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ సారా స్టెర్న్, రేషనల్‌వే క్యాపిటల్ పార్టనర్స్ వ్యవస్థాపకుడు CEO మార్క్ రోసెన్‌బ్లాట్, ఆక్సిడెంటల్ కాలేజ్ ట్రస్టీ లోరీ హంటర్, బిల్లింగ్స్లీ కంపెనీ భాగస్వామి హెన్రీ బిల్లింగ్స్లీ, బిల్లింగ్స్లీ కో సహ వ్యవస్థాపకురాలు లూసీ బిల్లింగ్స్లీ, ఎం అండ్ ఏ బిజినెస్ లీడర్ కృష్ణ చైతన్య బాలం ఉన్నారు.
Also Read : AP Govt Important Update on DSC Holders : డీఎస్సీ అభ్యర్థులకు సర్కార్ ఖుష్ కబర్
