DY CM Bhatti Vikramarka Important Comments : విద్య‌ తోనే సామాజిక మార్పు సాధ్యం : భ‌ట్టి

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఉప ముఖ్య‌మంత్రి

Hello Telugu - DY CM Bhatti Vikramarka Important Comments

Hello Telugu - DY CM Bhatti Vikramarka Important Comments

Bhatti Vikramarka : ఖ‌మ్మం జిల్లా : త‌మ‌ ప్రభుత్వం విద్యతోనే సామాజిక మార్పు సాధ్యం అనే ల‌క్ష్యంంతో ముందుకు సాగుతోంద‌ని స్ప‌ష్టం చేశారు ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ (Bhatti Vikramarka). రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తోందన్నారు. వైరాలో నిర్మిస్తున్న ఈ స్కూల్ భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా, ఒక గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని త‌న‌కు పూర్తి విశ్వాసం ఉంద‌న్నారు. వైరా నియోజకవర్గంలో 20 ఎకరాల్లో రూ. 200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం.

DY CM Bhatti Vikramarka Key Comments on Education

ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో, వైరాలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ ప్రాజెక్ట్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామ‌ని చెప్పారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు క్యాంపస్‌లోనే ఉండే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి, క్రీడా కార్యక్రమాలకు పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నామ‌ని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని ఈ సమగ్ర ఇంటిగ్రేటెడ్ స్కూల్ మోడల్ తెలంగాణ ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనంగా నిలుస్తుంద‌న్నారు.

స్కూల్ నిర్మాణానికి కావాల్సిన నిధుల్లో ఇప్పటికే రూ. 30 కోట్లు జమ చేశామ‌ని తెలిపారు మ‌ల్లు భ‌ట్టి విక్రమార్క‌. పనులు వేగంగా సాగేందుకు ప్రతి 15 రోజులకు నిధులు విడుదల చేస్తున్నాం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే డైట్ చార్జీలను 40 శాతం, కాస్మెటిక్ చార్జీలను 200 శాతం పెంచి, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకున్నామ‌ని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలు తెలుసుకునే విధానాన్ని అమలు చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం.

Also Read : KTR Gives Clear Instructions : 29న దీక్షా దివ‌స్ ను ఘ‌నంగా నిర్వ‌హించాలి

Exit mobile version