KTR : హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కీలక ప్రకటన చేశారు. ఈ నెల 29న ‘దీక్షా దివస్’ ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ చరిత్రలో గొప్ప ఘట్టానికి గుర్తుగా ‘దీక్షా దివస్’ ను నిర్వహిస్తూ వస్తున్నామన్నారు ప్రతి ఏటా. దశాబ్దంన్నర క్రితం, పార్టీ అధినేత , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ‘తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో’ అనే గొప్ప త్యాగ నిరతితో దీక్షను చేపట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. తెలంగాణ చరిత్రలో ఘనమైన ఈ ఘట్టాన్ని పురస్కరించుకొని దీక్షా దివస్‌ను పెద్ద ఎత్తున నిర్వహించాలని పిలుపునిచ్చారు.
KTR Key Comments on Deeksha Divas
దీనికి సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, పార్టీ జనరల్ బాడీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దీక్షా దివస్ నిర్వహణకు సంబంధించిన మార్గదర్శనం చేశారు. దీక్షా దివస్ నిర్వహణకు ముందుగా ఈ నెల 26వ తేదీన అన్ని జిల్లాల పార్టీ కేంద్రాల్లో ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. ఈ సమావేశాలకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు సహా ఇతర కీలక నాయకులందరినీ ఆహ్వానించాలని ఆయన ఆదేశించారు.
ఈ సన్నాహక సమావేశాల ముఖ్య ఉద్దేశం నవంబర్ 29న పార్టీ ఘనంగా నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.
Also Read : CM Chandrababu Interesting Comments on Saibaba : మహనీయుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా
