Deputy CM Bhatti Inspiring Meet : చిన్న‌నాటి స్నేహితుడితో భ‌ట్టి ముచ్చ‌ట‌

ఆనాటి జ్ఞాపకాల‌తో కొద్దిసేపు మాట‌మంతీ

Hello Telugu - Deputy CM Bhatti Inspiring Meet

Hello Telugu - Deputy CM Bhatti Inspiring Meet

Deputy CM Bhatti : హైద‌రాబాద్ – స్నేహమంటే ప్రాణమిచ్చే మనిషి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అని మరోసారి రుజువైంది. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా ముందుగా త‌న‌కు సంబంధించిన స్నేహితుల గురించి వాక‌బు చేయ‌డం అల‌వాటు. ప‌నిలో ప‌నిగా వికారాబాద్ జిల్లాలో అధికారికంగా పర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. తాండూరు నియోజకవర్గ పర్యటన క్రమంలో యాలాల మండలం జుంటుపల్లి గ్రామంలోని డాక్టర్ రవీందర్ రెడ్డి కుటుంబంతో త‌న‌కు ప్ర‌త్యేక అనుబంధం ఉంది. ఈ సంద‌ర్బంగా అనూహ్యంగా త‌న స్నేహితుడి ఇంటికి వెళ్లారు భ‌ట్టి విక్ర‌మార్క‌.

Deputy CM Bhatti Vikramarka Meet

తన వెంట ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లందరినీ కొద్దిసేపు పక్కన పెట్టి చిన్ననాటి మిత్రుని కుటుంబ సభ్యులందరితో ప్రశాంతంగా గడిపారు. కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగారు డిప్యూటీ సీఎం (Deputy CM Bhatti). పేరుపేరునా ఆరా తీశారు. చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగినప్పటికీ చిన్ననాటి బంధాన్ని గుర్తుచేసుకొని మరి ఇంటికి రావడమే కాదు ప్రజా ప్రతినిధులు అందరినీ పక్కనపెట్టి ప్రత్యేకంగా సమయం కేటాయించి యోగక్షేమాలు ఆరా తీయడం తో డాక్టర్ రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యుల కళ్లలో ఆనంద భాష్పాలు కనిపించాయి.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రవీందర్ రెడ్డి ఇంట్లోని ప్రతి గదిని పరిశీలించి చదువుకున్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. త‌న స్నేహితుడి కుటుంబం ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్థానిక సీతారామ చంద్రస్వామి దేవాలయ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులను రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులు డిప్యూటీ సీఎం వివరించారు. భ‌ట్టి వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read : CM Revanth Reddy Alarming : కాలుష్య ర‌హిత హైద‌రాబాదే ల‌క్ష్యం – సీఎం

Exit mobile version