Deputy CM Bhatti Interesting : రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ కోసం కాంగ్రెస్ పోరాటం

డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌క‌ట‌న

Hello Telugu - Deputy CM Bhatti Interesting

Hello Telugu - Deputy CM Bhatti Interesting

Deputy CM Bhatti : అమ‌రావ‌తి – రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ (Congress) క‌డ‌దాకా పోరాటం చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ (Deputy CM Bhatti). హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగిన న్యాయ సమరభేరి సభలో ప్ర‌సంగించారు. ఈ స‌భ పార్టీ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచి పోతుంద‌న్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లో భాగంగా కార్య‌క్రమాన్ని చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు. రాజ్యాంగం లేకపోతే బలహీన వర్గాలకు హక్కులు ఉండేవి కావన్నారు. ప్రతి పౌరునికి గౌరవం, సమాన హక్కులను కల్పించింది రాజ్యాంగం మాత్రమేనని గుర్తు పెట్టుకోవాల‌న్నారు. దేశంలోని పౌరులంద‌రికీ స‌మాన స్వేచ్ఛ‌, అవ‌కాశాలు క‌ల్పించిన అతి గొప్ప‌నైన భార‌త రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మి స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు డిప్యూటీ సీఎం.

Deputy CM Bhatti Vikramarka Comments

రైతుల సంక్షేమం కోసం కూట‌మి స‌ర్కార్ కృషి చేస్తోంద‌ని చెప్పారు. కేవలం మూడు నెలల్లోనే రూ. 21,000 కోట్ల రుణమాఫీ చేయడం జ‌రిగింద‌న్నారు. దేశ చరిత్రలోనే ఇది అరుదైన ఘట్టంగా పేర్కొన్నారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. రైతు భరోసా పథకంలో తొమ్మిది రోజుల్లో రూ.9,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామ‌న్నారు. బీమా ప్రీమియంగా రూ. 2,180 కోట్లు, పంట నష్ట పరిహారంగా రూ. 260 కోట్లు చెల్లించామ‌ని చెప్పారు. రైతుల కోసం దేశంలోని ఏ రాష్ట్రం ఇలాంటి సాయం చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం. భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి 12,000 అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, వ్యవసాయ పంపులకు ఉచిత విద్యుత్, వ్యవసాయానికి 17,000 కోట్లు చెల్లించామ‌ని చెప్పారు.

పేదలకు రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు రూ. 648 కోట్లు, 51 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ కోసం రూ.2,110 కోట్లు కేటాయించామ‌న్నారు. మహిళలకు వచ్చే 5 ఏళ్లలో లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని సంకల్పించామ‌ని ప్ర‌క‌టించారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి ఇంటికి 5 లక్షలు, 22,500 కోట్లు ఖర్చు చేస్తున్నామ‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రతి ఇంటికి, ప్రతి గడపకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

Also Read : Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

Exit mobile version