Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

నిప్పులు చెరిగిన కేంద్ర హోం శాఖ మంత్రి

Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Bandi Sanjay : హైద‌రాబాద్ – కేంద్ర మంత్రి బండి సంజ‌య్ నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీపై. గ‌త 70 ఏళ్లుగా ఒకే కుటుంబం చేతిలో ఆ పార్టీ కొన‌సాగుతోంద‌న్నారు. ద‌శాబ్దాలుగా పాలించిన ఆ పార్టీ ఏనాడైనా బ‌హుజ‌నుల‌కు ప్ర‌ధాని ప‌ద‌వి క‌ట్ట‌బెట్టిందా అని ప్ర‌శ్నించారు. ఎన్న‌డూ ఒక బీసీని సీఎం చేయ‌లేద‌న్నారు. తెలంగాణ‌లో ఇప్ప‌టికీ బీసీల‌కు ప‌ద‌వులు ఇవ్వాలంటే జ‌డుసు కుంటోంద‌న్నారు. కుల గ‌ణ‌న పేరుతో బీసీల సంఖ్య‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నం చేసింద‌ని ఆరోపించారు.

Minister Bandi Sanjay Shocking Comments

ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని సామాజిక న్యాయ స‌మ‌ర భేరి నిర్వ‌హిస్తారంటూ ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయం పదాన్ని ఉచ్చరించే హక్కు కూడా కాంగ్రెస్‌కు లేదన్నారు బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ (Bandi Sanjay).
శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దేశాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించింది కాక ఇప్పుడు సామాజిక న్యాయం పేరుతో మ‌రోసారి ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డం దారుణ‌మ‌న్నారు. ఎవ‌రిని ఉద్దరించేందుకు ఈ జ‌పం చేస్తున్నారంటూ సీరియ‌స్ అయ్యారు. గ‌త 11 ఏళ్లుగా త‌మ స‌ర్కార్ కొలువు తీర‌డంతో ప్ర‌పంచంలోనే ఇప్పుడు అత్యంత వేగ‌వంత‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా మారుతోంద‌న్నారు.

ఇన్నేళ్ల కాలంలో దేశంలో జ‌రిగిన స్కామ్ ల‌న్నీ కాంగ్రెస్ పార్టీ హ‌యాంలోనే జ‌రిగాయ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్. ఈ విష‌యం 143 కోట్ల భార‌తీయులంద‌రికీ తెలుస‌న్నారు. ఇది బ‌హిరంగ ర‌హ‌స్య‌మేన‌ని పేర్కొన్నారు. ఏం ముఖం పెట్టుకుని ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు సామాజిక న్యాయ భేరి అంటూ వెళ‌తార‌ని ఫైర్ అయ్యారు. అది సామాజిక న్యాయ భేరి కాద‌న్నారు.

Also Read : Mallikarjun Kharge Clear Orders : పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం – మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే

Exit mobile version