Dasoju Sravan Kumar Shocking Comments : ఎన్ని అక్ర‌మాలు చేసినా ధ‌ర్మ‌మే గెలుస్తుంది

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్

Hello Telugu - Dasoju Sravan Kumar Shocking Comments

Hello Telugu - Dasoju Sravan Kumar Shocking Comments

Dasoju Sravan Kumar : హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అక్ర‌మాల‌కు పాల్ప‌డినా చివ‌ర‌కు ధ‌ర్మ‌మే గెలుస్తుంద‌ని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ (Dasoju Sravan Kumar). ఆయ‌న గురువారం తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. లెజిస్లేటివ్ ట్రిబ్యూనల్‌లో స్పీకర్ సమక్షంలో ఫిరాయింపులపై విచారణ జరుగుతోందని అన్నారు. స్పీకర్ కార్యాలయం నుంచి ఓ బులెటిన్ విడుదల అయ్యింద‌ని, సందర్శకులకు, మీడియాకి ఆ బులెటిన్ ద్వారా అసెంబ్లీలోకి ప్రవేశాన్ని నిషేధిస్తున్న‌ట్లు తెలిపార‌ని, ఇది ప్ర‌జాస్వామ్యానికి పూర్తిగా విరుద్ద‌మ‌న్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలకు ప్రవేశాన్ని నిషేధించడం విడ్డూరంగా ఉంద‌న్నారు శ్ర‌వ‌ణ్ కుమార్. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వారి పార్టీల సభాపక్ష కార్యాలయాల వరకే అనుమతి ఉంటుందని బులెటిన్‌లో పేర్కొనడం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

Dasoju Sravan Kumar Shocking Comments on

ఈ కేసులో వాదిస్తున్న అడ్వకేట్లను సెల్‌ఫోన్‌‌లు తీసుకు రావద్దని బులిటిన్ హుకుం జారీ చేసింద‌ని ఆరోపించారు. ఇది పూర్తిగా భార‌త రాజ్యాంగానికి విరుద్దంగా ఉంద‌న్నారు. ఏం గూడుపుఠాణీ నడపాలని ఈ బులెటిన్ ద్వారా నిషేధాజ్ఞలు విధించారో చెప్పాల‌ని నిల‌దీశారు. సుప్రీం కోర్టు ఫుల్ బెంచ్ వాదనలు జరిగినపుడు కూడా సెల్‌ఫోన్లు అనుమతిస్తార‌ని, ఆ విష‌యం స్పీక‌ర్ తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. ఇది స్పీకర్ సొంత వ్యవహారం కాదు, రేవంత్ రెడ్డి సొంత ఇలాఖా కాద‌న్నారు. తక్షణమే బులెటిన్ ఎత్తి వేయాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ రాశాన‌ని చెప్పారు దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్. ఈ విచారణను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రజలు ప్రత్యక్ష్యంగా వీక్షించే అవకాశం ఇవ్వాల‌ని ఆయ‌న స‌ర్కార్ ను డిమాండ్ చేశారు.

Also Read : Harmanpreet Kaur Interesting Comments : దేశ వ్యాప్తంగా క్రికెట్ గురించే చ‌ర్చిస్తున్నారు

Exit mobile version