Harmanpreet Kaur Interesting Comments : దేశ వ్యాప్తంగా క్రికెట్ గురించే చ‌ర్చిస్తున్నారు

భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్

Hello Telugu - Harmanpreet Kaur

Hello Telugu - Harmanpreet Kaur

Harmanpreet Kaur : చెన్నై : ఐసీసీ మ‌హిళా వ‌న్డే వ‌ర‌ల్డ్ కప్ విజేత భార‌త జ‌ట్టు కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆమె చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. గ‌తంలో కంటే ఇప్పుడు క్రికెట్ గురించి ఎక్కువ‌గా మాట్లాడటం ఆనందంగా ఉంద‌న్నారు. ఇప్పుడు ప్రజలు క్రికెట్ గురించి మాత్రమే చ‌ర్చించు కోవ‌డం విస్తు పోయేలా చేసింద‌న్నారు. పురుషులా లేక మ‌హిళలా అన్న‌ది వాళ్లు ఆలోచించ‌డం లేద‌న్నారు. అయితే ఎక్కువ‌గా వారితో త‌మ‌ను పోల్చ‌డం కూడా ఎక్కువ‌గా ఉంటోంద‌న్నారు. దేశ వ్యాప్తంగా త‌మ‌కు ల‌భించిన మ‌ద్ద‌తు ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన రెస్పాన్స్ ను మ‌రిచి పోలేమ‌న్నారు. ఏదైనా స‌మిష్టిగా ప్ర‌య‌త్నం చేస్తే ఎలాంటి క‌ష్ట‌మైనా ఎదుర్కోగ‌ల‌మ‌ని త‌మ‌కు తెలిసి పోయింద‌న్నారు.

Harmanpreet Kaur Key Comments

విచిత్రం ఏమిటంటే కొన్నేళ్ల త‌ర్వాత భార‌త జ‌ట్టు ఈ ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింద‌న్నారు. ఇప్పుడు గ‌తంలో కంటే క్రికెట్ ను ఆస్వాదిస్తున్నారు. అంతే కాదు త‌మ‌దిగా భావిస్తున్నారు. వీక్షకుల సంఖ్య ఎక్కువగా ఉంది, స్టేడియంలు నిండి పోయాయి, ఇది మనందరికీ గర్వ కారణమైన క్షణం అని పేర్కొన్నారు హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్. క‌ప్ గెలిచిన త‌ర్వాత త‌మ జ‌ట్టు స‌భ్యుల‌తో కలిసి రాష్ట్ర‌ప‌తి ముర్ము, దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని క‌లిశామ‌న్నారు. జీవితంలో మ‌రిచి పోలేమ‌న్నారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాని కీల‌క‌మైన సూచ‌న‌లు చేశార‌ని తెలిపారు కౌర్. అవకాశం దొరికినప్పుడల్లా పాఠశాలలను సందర్శించి విద్యార్థులను ప్రేరేపించమని మమ్మల్ని కోరారని చెప్పారు. .ఈ రోజు నాకు ఆ అవకాశం లభించినందుకు తాను సంతోషానికి లోన‌వుతున్న‌ట్లు తెలిపారు.

Also Read : Popular Director SS Rajamouli Comments : గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కు వ‌చ్చే ఫ్యాన్స్ కు సూచ‌న‌లు

Exit mobile version