Dangeti Jahnavi Breakthrough : 2029లో అంత‌రిక్షంలోకి దంగేటి జాహ్నవి

ఏపీలోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు

Hello Telugu - Dangeti Jahnavi Breakthrough

Hello Telugu - Dangeti Jahnavi Breakthrough

Dangeti Jahnavi : ఎవ‌రీ దంగేటి జాహ్న‌వి అనుకుంటున్నారా. చిన్న త‌నంలోనే త‌ను చ‌రిత్ర సృష్టించింది. భార‌త దేశం నుంచి తొలి యువ‌తిగా వినుతికెక్కింది. త‌ను అంత‌రిక్షంలోకి ప్ర‌యాణం చేయ‌నుంది రాబోయే 2029వ సంవత్స‌రంలో. త‌న స్వ‌స్థ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు. ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. త‌న‌కు ముందు నుంచి స్పేస్ లోకి వెళ్లాల‌ని కోరిక ఉండేది. అందుకు అనుగుణంగా చాలా క‌ష్ట ప‌డింది. ప్ర‌తిస్టాత్మ‌క‌మైన ప్ర‌పంచంలో పేరు పొందిన అమెరికాలోని నాసాలో విజ‌య‌వంతంగా శిక్ష‌ణ పూర్తి చేసింది. త‌ను ప్ర‌థ‌మ భార‌తీయురాలిగా గుర్తింపు పొందింది.

Dangeti Jahnavi to Space

అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌ను అతి క‌ష్టం మీద గ‌ట్టెక్కింది. దంగేటి జాహ్న‌వి (Dangeti Jahnavi) రాబోయే నాలుగు సంవ‌త్స‌రాల‌లో ప్రారంభం అయ్యే యుఎస్ ఆధారిత ప్రాజెక్టు అయిన టైటాన్స్ ఆర్బిట‌ల్ పోర్ట్ స్పేస్ స్టేష‌న్ కోసం ప్ర‌యాణించేందుకు ఎంపికైంది. జాహ్న‌వి త‌న స్వంత ఊరు పాల‌కొల్లులో ఇంటర్ వ‌ర‌కు చ‌దువుకుంది. ఆ త‌ర్వాత పంజాబ్ లోని ప్ర‌ముఖ యూనివ‌ర్శిటీ ల‌వ్లీ ప్రొఫెష‌న‌ల్ విశ్వ విద్యాల‌యంలో అండ‌ర్ గ్రాడ్యూయేట్ విద్య‌ను పూర్తి చేసింది. త‌న పేరెంట్స్ శ్రీ‌నివాస్, ప‌ద్మ‌శ్రీ‌లు దుబాయ్ లో ఉంటున్నారు.

త‌ను స్టెమ్ విద్య‌, అంత‌రిక్ష ఔట్రీచ్ రంగంలో చురుకైన పాత్ర పోషించింది. ఇస్రో విద్యా కార్య‌క్ర‌మాల కోసం ప్రసంగించింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలలో విద్యార్థుల‌ను ఉద్దేశించి మాట్లాడింది. అంత‌ర్జాతీయ ప‌రంగా ఖ‌గోళ శోధ‌న స‌హ‌కారానికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా నాసా త‌న‌ను ఎంపిక చేసింది.

Also Read : Gachibowli Plot Cost Shocking :రూ. 33 కోట్ల‌కు అమ్ముడు పోయిన గ‌చ్చిబౌలి ప్లాట్

Exit mobile version