CSK Strong Focus – Sanju Samson : సంజూ శాంస‌న్ పై క‌న్నేసిన సీఎస్కే

కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ మేనేజ్మెంట్ కూడా

Hello Telugu - CSK Strong Focus - Sanju Samson

Hello Telugu - CSK Strong Focus - Sanju Samson

Sanju Samson : హైద‌రాబాద్ : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాడు. తాజాగా బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. ఓపెనింగ్ చేసే విష‌యంలో శాంస‌న్ ను ఆడిస్తామా లేదా అన్న అంశంపై ఇప్పుడే చెప్ప‌లేమంటూ పేర్కొన్నాడు. దీంతో దేశ వ్యాప్తంగా క్రికెట్ వ‌ర్గాల‌లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ఇదే స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీంతో ప‌రిస్థితి గ‌మ‌నించిన సంజూ శాంస‌న్ (Sanju Samson) త‌న బ్యాట్ కు ప‌ని చెప్పాడు. తాజాగా కేర‌ళ వేదిక‌గా జ‌రుగుతున్న కేర‌ళ క్రికెట్ లీగ్ టోర్నీలో దుమ్ము రేపాడు. కేవ‌లం నాలుగు ఇన్నింగ్స్ లు మాత్ర‌మే ఆడిన శాంస‌న్ 30 సిక్సులు కొట్టాడు. ఇది రికార్డ్. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ కేర‌ళ క్రికెట‌ర్ ఇలాంటి ఫీట్ ను సాధించ‌లేదు. ఫుల్ ఫామ్ లో కొన‌సాగుతున్నాడు.

CSK Focusing on Sanju Samson

సెలెక్ట‌ర్ల‌కు, బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షాకు, జ‌ట్టు స్కిప్ప‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ కు , ముఖ్యంగా న‌ర్మ గ‌ర్భంగా మాట్లాడిన అగార్క‌ర్ కు, జ‌ట్టు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ కు స‌వాల్ విసిరాడు. ఈ స‌మ‌యంలో త‌న‌ను రిలీవ్ చేయాల్సిందిగా ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాతినిధ్యం వ‌హించిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మేనేజ్మ‌మెంట్ ను కోరిన‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. దీంతో రిష‌బ్ పంత్ గ‌త ఐపీఎల్ సీజ‌న్ లో రికార్డు ధ‌ర‌కు అమ్ముడు పోయాడు. ఈసారి ఐపీఎల్ వేలం పాట (2026)లో వేలానికి సంజూ రానున్నాడ‌ని తేలి పోయింది. దీంతో త‌న‌ను చేజిక్కించు కునేందుకు ప‌లు జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. వాటిలో మొద‌ట‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్ ఉండ‌గా మ‌రో జ‌ట్టు షారుక్ ఖాన్ నేతృత్వంలోని కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ఉన్నాయి. త‌ను ఎవ‌రికి ద‌క్కుతాడ‌నేది వేచి చూడాలి.

Also Read : CSK New Chairman Srinivasan Interesting : చెన్నై సూప‌ర్ కింగ్స్ చైర్మ‌న్ గా శ్రీ‌నివాస‌న్

Exit mobile version