CSK New Chairman Srinivasan Interesting : చెన్నై సూప‌ర్ కింగ్స్ చైర్మ‌న్ గా శ్రీ‌నివాస‌న్

వెల్ల‌డించిన సీఎస్కే సీఈఓ కాశి విశ్వ‌నాథ‌న్

Hello Telugu - CSK New Chairman Srinivasan Interesting

Hello Telugu - CSK New Chairman Srinivasan Interesting

Srinivasan : చెన్నై : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్)లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గ‌తంలో బీసీసీఐలో కీల‌క పాత్ర పోషించిన శ్రీ‌నివాస‌న్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. గ‌త కొన్నేళ్లుగా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌నతో ఆక‌ట్టుకుంటున్న చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు చైర్మ‌న్ గా శ్రీ‌నివాస‌న్ (Srinivasan) నియమితుల‌య్యారు. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు సీఎస్కే ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి కాశీ విశ్వ‌నాథ‌న్. తాజాగా జ‌రిగిన సీఎస్కే కీల‌క బోర్డు స‌మావేశంలో ఏక‌గ్రీవంగా త‌మ జ‌ట్టుకు చైర్మ‌న్ గా శ్రీ‌నివాస‌న్ సేవ‌లు అవ‌స‌ర‌మ‌ని భావిస్తూ తీర్మానం చేసిన‌ట్లు తెలిపారు సీఈఓ.

Srinivasan as a CSK New Chairman

ప్ర‌స్తుతం జ‌ట్టుకు జార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ స్కిప్ప‌ర్ గా ఉన్నాడు. ఆయ‌న వ‌య‌సు కూడా అయి పోతోంది. అయితే జ‌ట్టును దుర్బేద్య పూర్వ‌కంగా త‌యారు చేయ‌డంలో ధోనీ కీల‌క పాత్ర పోషించారు. దీంతో సీఎస్కే త‌న‌ను ఏ మాత్రం వ‌దులు కోవ‌డానికి సిద్దంగా లేదు. ఆయ‌న‌పై ఇప్ప‌టికీ చెర‌గ‌ని అభిమానం ఉంది. ఎక్క‌డికి వెళ్లినా ధోనీని ఎక్కువ‌గా ఆద‌రిస్తారు. అక్కున చేర్చుకుంటారు. భార‌తీయ క్రికెట్ జ‌ట్టు ప‌రంగా చూస్తే ఐపీఎల్ లో ప్ర‌స్తుతం ధోనీ త‌ర్వాత కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ తో పాటు ఢిల్లీకి చెందిన రిష‌బ్ పంత్ ఉన్నారు.

ఎన్. శ్రీ‌నివాస‌న్ చైర్మ‌న్ గా రావ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు సీఈఓ కాశీ విశ్వ‌నాథ‌న్. చెన్నై సూపర్ కింగ్స్ జ‌ట్టుకు త‌ను ఓ వ‌రం లాంటి వాడ‌ని పేర్కొన్నారు. మేజ‌ర్ లీగ్ ల‌తో పాటు సీఎస్కే ఆస్తుల నిర్వ‌హ‌ణ‌ను కూడా ప‌ర్య‌వేక్షిస్తార‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Minister Savitha Interesting Update :చేనేత ఉత్ప‌త్తుల కోసం వీవ‌ర్ కార్డ్ : స‌విత

Exit mobile version