CPI Ramakrishna Shocking Comments : బాబు ప‌ర్య‌ట‌నలు త‌ప్పా సాధించింది ఏముంది..?

నిప్పులు చెరిగిన సీపీఐ కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌

Hello Telugu - CPI Ramakrishna Shocking Comments

Hello Telugu - CPI Ramakrishna Shocking Comments

CPI Ramakrishna : తిరుప‌తి – ఏపీ సీఎం చంద్ర‌బాబు సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌పై సీపీఐ కార్య‌ద‌ర్శి రామకృష్ణ స్పందించారు. ఈ టూర్ వ‌ల్ల ఏపీకి ఎలాంటి లాభం ఉండ‌ద‌న్నారు. కేవ‌లం ప్ర‌భుత్వ సొమ్ము ఖ‌ర్చు కావ‌డం త‌ప్ప అంటూ మండిప‌డ్డారు. కూట‌మి పాల‌న‌లో ఎలాంటి మార్పు లేద‌న్నారు. బాబు ఇప్ప‌టి వ‌ర‌కు 21 సార్లు ఢిల్లీకి వెళ్లాడ‌ని, కేంద్రం నుంచి ఏపీకి ఏం తీసుకు వ‌చ్చాడో చెప్ప లేద‌న్నారు. సోమవారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌తీసారి ఇది కోరాను, అది కోరాను అని చెప్పడం తప్ప ఏయే రంగాల‌కు ఎంతెంత నిధులు తీసుకు వ‌చ్చార‌నే విష‌యం చెప్ప‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

CPI Ramakrishna Key Comments on CM Chandrababu

ప్ర‌చారం చేసుకోవ‌డం త‌ప్ప ఏపీకి ఏం సాధించారో శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని రామ‌కృష్ణ (CPI Ramakrishna) డిమాండ్ చేశారు. త‌న వ్య‌క్తిగ‌తంగా ఇమేజ్ పెంచుకోవ‌డంపైనే చంద్ర‌బాబు నాయుడు ఎక్కువ‌గా దృష్టి సారిస్తున్నార‌ని ఆరోపించారు. ఓ వైపు పాల‌నా ప‌రంగా ఎలాంటి మార్పులు తీసుకు రాలేక పోవ‌డం ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. గ‌తంలో ఉన్న ప్ర‌భుత్వం ఇలాగే వ్య‌వ‌హ‌రించింద‌ని, చివ‌ర‌కు 11 సీట్ల‌కే ప‌రిమితం అయింద‌ని ఆ విష‌యం చంద్ర‌బాబు నాయుడు గుర్తు పెట్టుకుంటే మంచిద‌ని సెల‌విచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని గొప్పగా చెబుతున్న కూటమి ప్రభుత్వం ఏం అభివృద్ధి సాధించిందో చెప్పాలన్నారు. ఇక డిప్యూటీ సీఎం స‌నాత‌న ధ‌ర్మం పేరుతో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నాడ‌ని, ఇంకో వైపు సినిమా షూటింగ్ ల‌లో బిజీగా ఉన్నార‌ని ఇక ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ఎప్పుడు ప‌రిష్క‌రిస్తారంటూ ప్ర‌శ్నించారు.

Also Read : MLA Raja Singh Fired on TG BJP Chief : రామ‌చందర్ రావు రైట‌ర్ కానీ ఫైట‌ర్ కాదు

Exit mobile version