Hero Rajinikanth Coolie – Rachita Ram : కూలీ బ్లాక్ బ‌స్ట‌ర్ ర‌చితా రామ్ సూప‌ర్

విలిన‌జంతో ఆక‌ట్టుకున్న న‌టి

Hello Telugu - Hero Rajinikanth Coolie - Rachita Ram

Hello Telugu - Hero Rajinikanth Coolie - Rachita Ram

Coolie : లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కూలీ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి రోజే ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 170 కోట్లు క‌లెక్ష‌న్స్ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇందులో ర‌జ‌నీకాంత్, స‌త్య రాజ్, ఉపేంద్ర‌, అమీర్ ఖాన్, సౌబిన్ తో పాటు శ్రుతీ హాస‌న్ తో పాటు స్పెష‌ల్ సాంగ్ లో త‌ళుక్కున మెరిసింది పూజా హెగ్డే. ఈ సినిమాలో మ‌రో ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించి మెప్పించింది న‌టి ర‌చితా రామ్. త‌ను అద్బుత‌మైన విల‌నిజాన్ని పండించింద‌ని అంటున్నారు ఫ్యాన్స్. ఆమె పాత్ర‌తో పాటు మ‌ల‌యాళం న‌టుడు సౌబీన్ షాహిర్ న‌ట‌న సినిమాకు ప్ల‌స్ పాయింట్ అని పేర్కొంటున్నారు.

Coolie Movie – Rachita Ram Acting Viral

ఇక కూలీ (Coolie) సినిమాలో ప్ర‌త్యేకంగా చెప్పు కోవాల్సింది ర‌చితా రామ్ గురించే. త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. యూత్ ను కిర్రాక్ తెప్పించేలా చేసింది. త‌ను రెండో భాగంలో వ‌స్తుంది. సైమన్ షిప్పింగ్ పోర్ట్ లో కళ్యాణి అనే అమాయక ఉద్యోగి పాత్రలో రచితా రామ్ నటించారు పాత్ర పరివర్తన అందరినీ ఆశ్చర్య ప‌రిచేలా చేసింది. విక్రమ్‌లో ఏజెంట్ టీనా పాత్ర లాగానే ర‌చిత‌ను జోడించాడు . ఇందులో ఉపేంద్ర పొడిగించిన అతిధి పాత్ర , రచితా రామ్ భయంకరమైన విలన్‌గా చిత్రీకరించడం వల్ల ఈ చిత్రం కర్ణాటకలో ఉన్న బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందని భావిస్తున్నారు.

ఇంత‌కూ ర‌చితా రామ్ ఎవ‌ర‌ని అనుకుంటున్నారా. త‌న స్వ‌స్థ‌లం కర్ణాట‌క‌. బెంగ‌ళూరులో పుట్టింది. క‌న్న‌డ సినీ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టిగా ఉన్నారు . క్లాసిక్ రూపంలో శిక్ష‌ణ పొందింది. 50కి పైగా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చింది. ర‌చిత టెలివిజ‌న్ వేదిక‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ త‌ర్వాత 2013లో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. త‌న న‌వ్వు చాలా బావుంటుంది. బెంగ‌ళూరు టైమ్స్ ఏకంగా ర‌చితా రామ్ ను మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ అని అవార్డు ప్ర‌క‌టించింది. కూలీతో మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించింది.

Also Read : Popular Singer Rahul Sipligunj Meet : సీఎం రేవంత్ కు ‘కోటి’ ఇచ్చినందుకు థ్యాంక్స్

Exit mobile version