ముంబై : బాలీవుడ్ నే కాదు యావత్ దేశ వ్యాప్తంగా షేక్ చేస్తోంది ధురంధర్ మూవీ. ఈ సినిమా ఏకంగా వరల్డ్ వైడ్ గా తాజాగా అందిన సమాచారం మేరకు రూ. 550 కోట్ల మార్క్ ను దాటేసింది. వసూళ్లలో సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది. చిత్ర నిర్మాత ఆదిత్య ధర్ దీనిని నిర్మించాడు భారీ బడ్జెట్ తో. విడుదలైన ధురంధర్ చిత్రం ఇండియాలో ఇప్పటి వరకు రూ. 430.20 కోట్లు వసూలు చేసింది. విదేశీ వసూళ్ల పరంగా చూస్తే రూ. 122.50 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. గూఢచారి డ్రామా నేపథ్యంలో ధురంధర్ ను తీశాడు దర్శకుడు. కేవలం 10 రోజుల్లోనే రూ. 550 కోట్లకు పైగా వసూలు చేసి ట్రేడ్ వర్గాలను విస్తు పోయేలా చేసింది. ఆకట్టుకునే సన్నివేశాలు, అద్బుతమైన సంభాషణలు, వెరసి నటీ నటుల పర్ ఫార్మెన్స్ పీక్ స్టేజ్ కు తీసుకు వెళ్లేలా చేశాడు.
ఇదిలా ఉండగా రూ. 550 కోట్ల మార్క్ ను తమ ధురంధర్ సినిమా దాటేసిందని ప్రకటించారు అధికారికంగా చిత్ర నిర్మాతలు. ఇదిలా ఉండగా డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది ఈ మూవీ. ఇందులో రణవీర్ సింగ్ నటించాడు. రెండవ ఆదివారం ఇండియాలో రూ. 58.200 కోట్ల నికర వసూళ్లను రాబట్టడం విశేషం. హిందీ చిత్రానికి ఇప్పటి వరకు వచ్చిన అత్యధిక వసూళ్లు ఇదే కావడం గమనార్హం. ఈ చిత్రం మొదటి వారంలో రూ. 218 కోట్ల నికర వసూళ్లతో ప్రారంభమైంది. రెండవ శుక్రవారం రూ. 34.70 కోట్లు, రెండవ శనివారం రూ. 53.70 కోట్లు వసూలు చేసి, చారిత్రాత్మకమైన రెండవ ఆదివారం వసూళ్లతో ముగిసింది. ఈ విజయాన్ని ఇక ఎవరూ ఆపలేరన్నారు చిత్ర నిర్మాతలు. రాబోయే రోజుల్లో మరెన్ని కోట్లు కలెక్షన్స్ చేస్తుందనేది అంచనా వేయలేం.
