Rahul Sipligunj : హైదరాబాద్ – ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గురువారం మర్యాద పూర్వకంగా హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కలిశారు. ఈ సందర్బంగా తనతో కొద్దిసేపు ముచ్చటించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గాయకుడికి భారీ నజరానా ప్రకటించింది. రాహుల్ (Rahul Sipligunj) కు రూ. కోటి ఇవ్వాలని బహిరంగంగానే వెల్లడించారు. దీంతో మరోసారి వైరల్ గా మారాడు సదరు గాయకుడు. తను ఆర్ఆర్ఆర్ కోసం పాడిన నాటు నాటు సాంగ్ ఏకంగా ఆస్కార్ అవార్డు లభించింది. అమెరికా వేదికపై కూడా ఈ పాటను పాడుతూ డ్యాన్స్ లో పాల్గొన్నాడు. తనకు ప్రత్యేకంగా కోటి రూపాయలు బహుమానంగా ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు రాహుల్ సిప్లిగంజ్. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీకి అనుగుణంగా బోనాలు పండుగ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ కు రూ. కోటి అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Singer Rahul Sipligunj Meet CM Revanth Reddy
2023లో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న నాటు నాటు పాటతో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. రేవంత్ రెడ్డి గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు యువ గాయకుడికి రూ. 10 లక్షల బహుమతిని ఇస్తానని హామీ ఇచ్చారు . అంతే కాదు తాము గనుక అధికారంలోకి వస్తే తప్పకుండా భారీ ఎత్తున నగదు పురస్కారం ఇస్తానని ప్రకటించాడు. ఇటీవల జరిగిన గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా సీఎం ఈ హామీని పునరుద్ఘాటించారు, త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొన్నారు. దీని ప్రకారం ఓల్డ్ సిటీలో జరిగిన బోనాలు పండుగ సందర్భంగా ప్రభుత్వం నగదు బహుమతిని ప్రకటించింది.
Also Read : Minister Kiren Rijiju Fired on Rahul Gandhi : రాజ్యాంగం అంటే రాహుల్ కు లెక్కలేదు
