హైదరాబాద్ : దర్శకుడు మారుతి దర్శకత్వం వహించిన డార్లింగ్ ప్రభాస్ నటించిన చిత్రం రాజ సాబ్. దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్. ఇప్పటికే ట్రైలర్ , సాంగ్ కూడా విడుదలైంది. తాజాగా ఇదే సినిమా నుంచి మరో సింగిల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే పూర్తి వెర్షన్ సాంగ్ మాత్రం ఈనెల 17న సాయంత్రం 6.35 గంటలకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు మూవీ మేకర్స్. దర్శకుడు ప్రభాస్ ను సరికొత్తగా రొమాంటిక్ మూడ్ లో ఉండేలా చిత్రీకరించినట్లు సమాచారం. ఇప్పటికే హీరో వయొలెంట్ గా సలార్, కల్కి వంటి యాక్షన్ సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించాడు. ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉన్న రాజా సాబ్ లో మాత్రం పూర్తిగా ఆ రెండు సినిమాలకు భిన్నంగా లవర్ బాయ్ గా కనిపించేలా చేస్తున్నాడు దర్శకుడు మారుతి.
ది రాజా సాబ్ లో పూర్తిగా రొమాంటిక్ కోణాన్ని ఆవిష్కరించనున్నాడు. తాజాగా కీలక అప్ డేట్ ఇచ్చాడు దర్శకుడు. వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించాడు. హారర్, లవ్ జానర్ లో ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఇక సహానా రెండవ సింగిల్ ప్రోమో విడుదలైన తర్వాత ఈ చిత్రంపై అంచనాలు మరింత పెంచేలా చేశాయి. ఇందులో ప్రభాస్ తో పాటు నిధి అగర్వాల్ పూర్తిగా రొమాంటిక్ మూడ్ లో ఉండడం విశేషం. దీంతో పాన్ ఇండియా స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఎస్ఎస్ థమన్ మధురమైన సంగీతం అందించారు. స్పెయిన్ లో సుందరమైన ప్రదేశాలలో ఈ పాటను చిత్రీకరించారు.
