ప‌ల్నాడు జిల్లాకు రూ. 84 కోట్ల‌తో ఆర్ఓబీల నిర్మాణం

తీపి క‌బురు చెప్పిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి వైష్ణ‌వ్

hellotelugu-MPLavuDevarailu

ఢిల్లీ : ప‌ల్నాడు ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త చెప్పింది కేంద్ర ప్ర‌భుత్వం. రూ. 84 కోట్ల భారీ నిధులతో రెండు ROBల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవ రాయలు గారి ప్రత్యేక చొరవ, నిరంతర కృషి ఫలితంగా.. సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల ప్రజల దశాబ్దాల నాటి కల నెర వేరబోతోంది. రైల్వే గేట్ల దగ్గర గంటల కొద్దీ ఆగిపోతూ ట్రాఫిక్ కష్టాలు పడుతున్న వాహనదారుల ఇబ్బందులను ఎంపీ కేంద్ర రైల్వే శాఖ దృష్టికి తీసుకు వెళ్లారు, పట్టుబట్టి రూ.84 కోట్ల భారీ నిధులను మంజూరు చేయించారు.

పెదకూరపాడు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న గేటు (LC 27) స్థానంలో ఒక‌టి , సత్తెనపల్లి – రెడ్డిగూడెం మధ్యలో ఉన్న రైల్వే గేటు (LC 40) స్థానంలో మరొకటి మంజూరు చేసిన‌ట్లు తెలిపారు ఈ సంద‌ర్బంగా ఎంపీ లావు శ్రీ‌కృష్ణ దేవ‌రాయ‌లు. పై రెండు చోట్ల రైల్వే గేట్లను తీసేసి, వాటి స్థానంలో సరికొత్త 2-లేన్ల భారీ ఫ్లైఓవర్ (రైల్వే ఓవర్ బ్రిడ్జ్)లు కట్టడానికి రైల్వే శాఖ టెండర్లు విడుదల చేసింది!. ఈ రెండు భారీ బ్రిడ్జిల నిర్మాణ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నాం అన్నారు. అత్యంత వేగంగా, కేవలం ఏడాదన్నరలోనే వీటి నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని ఎంపీ లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇకపై ట్రైన్ వచ్చేటప్పుడు గేటు పడుతుందనే తిప్పలు ఉండవని, ప్రయాణం సాఫీగా, సురక్షితంగా సాగిపోనుందని పేర్కొన్నారు.

Exit mobile version