Congress : హైదరాబాద్ : ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ (Congress) కీలక ప్రకటన చేసింది. ఎంతో ఆర్భాటంగా ఈనెల 15న కామారెడ్డి జిల్లాలలో చేపట్టాల్సిన 42 శాతం బీసీ రిజర్వేషన్ సభను అర్ధాంతరంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం అధికారికంగా తెలిపింది. ఈ సమావేశానికి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ ఏఐసీసీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ బాస్ మల్లికార్జున్ ఖర్గే వస్తారని ఇప్పటికే ప్రకటించారు. వీరితో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా వస్తారని ప్రచారం చేశారు. భారీ ఎత్తున ఏర్పాట్లలో మునిగి పోయారు.
Congress Key Updates
తాజాగా కేంద్ర, రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేయడంతో కామారెడ్డి జిల్లాలో తలపెట్టిన బీసీ రిజర్వేషన్ సభను వాయిదా వేయక తప్పడం లేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. వెనుకబడిన తరగతుల (బీసీలు) చట్టాన్ని ఆమోదించిన సందర్భంగా దీనిని నిర్వహించాలని పార్టీ తలపెట్టింది. ప్రియాంక గాంధీ, సీఎం సిద్దరామయ్యలు కూడా వస్తారని ప్రచారం చేశారు. ఈ సమావేశాన్ని తిరిగి షెడ్యూల్ చేసి, తరువాత తేదీలో నిర్వహిస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్త తేదీ ఖరారు అయిన తర్వాత జాతీయ,రాష్ట్ర నాయకులు హాజరవుతారని టీపీసీసీ ప్రకటించింది.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించే బిల్లును ఆమోదించ లేదు. ఆ బిల్లు ఆమోదం కోసం గవర్నర్ రాష్ట్రపతికి పంపించారు. ఇంకా చట్టంగా మారలేదు. అయితే పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. కాగా బీసీలు డోంట్ కేర్ అంటున్నారు. ముందు చట్టం చేయాలని కోరుతున్నారు.
Also Read : Vaishno Devi Yatra Interesting Update : 14 నుంచి వైష్ణో దేవి యాత్ర పునః ప్రారంభం
