Vaishno Devi Yatra Interesting Update : 14 నుంచి వైష్ణో దేవి యాత్ర పునః ప్రారంభం

ప్ర‌క‌టించిన ఆయ‌ల నిర్వాహ‌కులు

Hello Telugu - Vaishno Devi Yatra Interesting Update

Hello Telugu - Vaishno Devi Yatra Interesting Update

Vaishno Devi Yatra : జ‌మ్మూ కాశ్మీర్ : భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పారు ప్ర‌సిద్ద వైష్ణో దేవి ఆల‌య నిర్వాహ‌కులు. సెప్టెంబ‌ర్ 14 నుంచి తిరిగి వైష్ణో దేవి యాత్ర (Vaishno Devi Yatra) పునః ప్రారంభం అవుతుంద‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా గ‌త‌ ఆగస్టు 26న కొండచరియలు విరిగిపడి 34 మంది మృతి చెందారు. మ‌రో 20 మంది గాయప‌డ‌డంతో అర్ధాంత‌రంగా యాత్ర‌ను నిలిపి వేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లా మాతా వైష్ణో దేవి గుహ మందిరానికి తీర్థయాత్ర 19 రోజుల పాటు నిలిపి వేశారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు స‌హ‌క‌రిస్తుండ‌డంతో ఆదివారం నుండి యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు వెల్ల‌డించారు.

Vaishno Devi Yatra Updates

ఈ సంద‌ర్బంగా అధికారికంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. జై మాతా జీ. అనుకూలమైన వాతావరణ పరిస్థితులకు లోబడి వైష్ణో దేవి యాత్ర ప్రారంభం కానుంద‌ని చెప్ప‌డానికి సంతోషిస్తున్నామ‌ని పేర్కొన్నారు. వివరాలు , బుకింగ్‌ల కోసం ద‌యచేసి www.maavaishnodevi.org ని సందర్శించాన‌లి కోరింది శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు ఎక్స్ వేదిక‌గా కోరింది. యాత్రికుల‌కు ప‌లు సూచ‌చ‌న‌లు చేసింది. యాత్రికులు చెల్లుబాటు అయ్యే గుర్తింపును తీసుకెళ్లాలని, నియమించబడిన మార్గాలను అనుసరించాలని, ఆన్-గ్రౌండ్ సిబ్బందితో సహకరించాలని సూచించారు. యాత్ర పునః ప్రారంభం మన సమిష్టి విశ్వాసం, స్థితిస్థాపకతకు పునరుద్ఘాటనను సూచిస్తుంది. ఈ గౌరవనీయమైన తీర్థయాత్ర పవిత్రత, భద్రత, గౌరవాన్ని నిలబెట్టడానికి బోర్డు కట్టుబడి ఉంది అని తెలిపారు.

Also Read : Bigg Boss 9 Interesting : ఆస‌క్తిని రేపుతున్న బిగ్ బాస్ -9 షో

Exit mobile version