Hydraa Important Update : అమీర్‌పేట ముంపున‌కు హైడ్రా ప‌రిష్కారం

డీసిల్టింగ్ ప‌నులు ప‌రిశీలించిన క‌మిష‌న‌ర్

newsseals-hydraa

Hydraa : హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. న‌గ‌రంలో ఆక్ర‌మ‌ణ‌ల‌పై దృష్టి సారించింది. న‌గ‌రంలో నాలాల ప‌రిస్థితిని స్వ‌యంగా ప‌రిశీలించారు హైడ్రా (Hydraa) క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. వ‌ర్షం వ‌స్తే ఆందోళ‌న‌. 10 సెంటీమీట‌ర్ల వ‌ర్షం ప‌డితే ర‌హ‌దారుల‌న్నీ జ‌ల‌మ‌యం. ఇక అమీర్‌పేట గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలా.. జూబ్లీహిల్స్‌, గాయ‌త్రీ హిల్స్‌, యూసుఫ్‌గూడ‌, కృష్ణాన‌గ‌ర్‌, మ‌దురాన‌గ‌ర్‌, శ్రీ‌నివాస న‌గ‌ర్ ప్రాంతాల నుంచి వ‌చ్చే వ‌ర‌ద ముందుకు సాగ‌క అమీర్‌పేట‌లో ఎక్క‌డిక‌క్క‌డ పీకల లోతు నీళ్లు కూరుకు పోవ‌డం ష‌రా మామూలే. ప్ర‌ధాన ర‌హ‌దారిపై నిలిచి పోవ‌డం, వాహ‌న రాక‌పోక‌ల‌కు ఇబ్బంది క‌ల‌గ‌డం. ఇవ‌న్నీ న‌గ‌ర వాసుల‌కు ప్ర‌తి ఏటా అనుభ‌వంలోకి వ‌చ్చిన వ‌ర‌ద క‌ష్టాలే. ఈ ఏడాది ఆ స‌మ‌స్య‌కు హైడ్రా ప‌రిష్కారం చూపింది. వ‌ర‌ద క‌ష్టాల‌కు తెర దించింది.

Hydraa Key Update

ఇప్పుడు 10 సెంటీమీట‌ర్ల వ‌ర్షం ప‌డితే నీరు నిల‌వ‌కుండా ముందుకు సాగేలా హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంది. ఈ ప‌నుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ నిరంత‌రం ప‌ర్య‌వేక్షించారు. హైడ్రా, జీహెచ్ ఎంసీ, జ‌ల‌మండ‌లి, ఇరిగేష‌న్ అధికారుల‌తో ప‌లుమార్లు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి ప‌రిష్కార మార్గం చూపారు. ఈ క్ర‌మంలో అమీర్‌పేట‌లో ప‌ర్య‌టించి పూడుకు పోయిన నాలాల నుంచి మ‌ట్టిని, చెత్త‌ను తొల‌గించే ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించారు. అమీర్‌పేట‌లో వ‌ర‌ద ముప్పు త‌ప్పించేందుకు అనుస‌రించిన విధానం న‌గ‌రంలోని అనేక ముంపు ప్రాంతాల‌కు ప‌రిష్కార మార్గ‌మ‌ని క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు. ఇదే స‌మ‌యంలో కీల‌క సూచ‌న‌లు కూడా చేశారు. ఎప్ప‌టిక‌ప్పుడు నాలాల ప‌నితీరును ప‌రిశీలిస్తూ ఉండాల‌ని అన్నారు.

Also Read : PM Modi Important Comments : విజ‌న్ ఉన్న నేత‌లు చంద్రబాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్

Exit mobile version