Singhvi : ముంబై : బాలీవుడ్ కంపోజర్ సచిన్ సంఘ్వి ‘లైంగిక వేధింపుల’ కేసులో అరెస్టు అయ్యారు. తన 20 ఏళ్ల వయసులో ఫిబ్రవరి 2024లో సంఘ్వితో పరిచయం ఏర్పడిందని, తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం పంపాడంటూ బాధితురాలు ఆరోపణలు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలీవుడ్ గాయకుడు, సంగీత దర్శకుడు సచిన్ సంఘ్వి ఒక మ్యూజిక్ ఆల్బమ్‌లో అవకాశం ఇస్తానని, తనను పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని వాపోయింది . దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది మ్యూజిక్ డైరెక్టర్ ను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇదిలా ఉండగా సింఘ్వీ (Singhvi) స్త్రీ 2, భేదియా చిత్రాలకు మ్యూజిక్ అందించాడు. ఇవి రెండూ మ్యూజికల్ గా హిట్ గా నిలిచాయి. దీంతో తనకు మంచి పేరు తీసుకు వచ్చేలా చేసింది.
Composer Singhvi Arrest
దీంతో కంపోజర్ సింఘ్వీని భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత విభాగాల కింద అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ పై విడుదల అయ్యాడు సింఘ్వీ. అయినప్పటికీ తనపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా సచిన్ సంఘ్వీ తరపున వాదిస్తున్న న్యాయవాది ఆదిత్య మిథే మీడియాతో మాట్లాడారు. సంఘ్వీ అరెస్టు పరిస్థితులను సవాలు చేశారు. నా క్లయింట్‌పై ఎఫ్‌ఐఆర్‌లోని ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి అని అన్నారు. ఈ కేసుకు ఎటువంటి అర్హతలు లేవు. నా క్లయింట్‌ను పోలీసులు నిర్బంధించడం చట్టవిరుద్ధం అన్నాడు. అందుకే అతను వెంటనే బెయిల్‌పై విడుదలయ్యాడని తెలిపాడు.
Also Read : FATF Warning to Pakistan : పాకిస్తాన్ కు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వార్నింగ్
