FATF Warning to Pakistan : పాకిస్తాన్ కు ఫైనాన్షియ‌ల్ యాక్ష‌న్ టాస్క్ ఫోర్స్ వార్నింగ్

ఉగ్ర‌వాదుల‌కు నిధులు ఎలా కేటాయిస్తారంటూ ఫైర్

Hello Telugu - FATF Warning to Pakistan

Hello Telugu - FATF Warning to Pakistan

FATF : అమెరికా : దాయాది పాకిస్తాన్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. గ్లోబల్ టెర్రర్ ఫండింగ్ వాచ్‌డాగ్ అయిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) తీవ్ర స్థాయిలో ఆ దేశాన్ని హెచ్చ‌రించింది. ఉగ్ర‌వాదుల‌కు నిధుల‌ను ఎలా స‌మ‌కూరుస్తారంటూ ప్ర‌శ్నించింది. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొంది. పాకిస్తాన్‌ను అక్టోబర్ 2022లో ‘గ్రేలిస్ట్’ నుండి తొలగించడం వల్ల మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల నుండి ఉపశ‌మ‌నం ల‌భించ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యాన్ని ఎఫ్ఏటీఎఫ్ అధ్య‌క్షురాలు ఎలిసా డి అండా మ‌ద్రాజో వెల్ల‌డించారు. శ‌నివారం ఆమె మీడియాతో మాట్లాడారు. గ్రే లిస్ట్‌లో ఉన్నప్పటికీ గ్రే లిస్ట్‌లో ఉన్న ఏ దేశమైనా నేరస్థుల చర్యలకు, మనీలాండరింగ్ కు పాల్ప‌డినా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు.

FATF Strong Warning to Pakistan

ఉగ్రవాద నిరోధక నిధుల చర్యలను అమలు చేస్తుందని నిర్ధారించుకోవడానికి దానిపై ఫాలో-అప్ జరుగుతోంది. కాగా పాకిస్తాన్ స‌భ్యురాలు కాక పోయిన‌ప్ప‌టికీ ఆసియా పసిఫిక్ గ్రూప్ (ఏపీజీ) ఫాలో అప్ చేస్తోంది. ఉగ్రవాద నిధులు, మనీ లాండరింగ్‌ను ఎదుర్కోవడంలో గణనీయమైన వ్యూహాత్మక లోపాలు ఉన్నందున ఈ జాబితాలో వివిధ దేశాలు, అధికార పరిధిని పెంచిన పర్యవేక్షణలో ఉంచినట్లు అధ్య‌క్షురాలు వెల్ల‌డించారు. జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాద శిబిరాలకు నిధులు సమకూర్చడానికి , ఆర్థిక ప్రవాహాలను కప్పి పుచ్చడానికి డిజిటల్ వాలెట్లను ఉపయోగిస్తున్నట్లు వచ్చిన నివేదికల మధ్య త‌ను చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Also Read : AP Govt Important Update : ముంపు బాధితుల‌కు స‌ర్కార్ భ‌రోసా

Exit mobile version