హైదరాబాద్ : నితిన్ నటించిన రొమాంటిక్ , ఎంటర్టైనర్ మూవీ అలియాస్ రుక్మిణి విడుదల కాకుండానే ఆసక్తిని రేపుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి రెండో పాట పిచ్చి ప్రేమలో కు సంబంధించి ఆసక్తికర వార్త బయటకు వచచ్చింది. ఇదే క్రమంలో మూవీ మేకర్స్ సంచలన ప్రకటన చేశారు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొన్ని మిగిలి ఉన్నాయని, డిసెంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా అలియాస్ రుక్మిణిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. దీనికి ముందుగా నవంబర్ 13న శుక్రవారం ఈ చిత్రంలోని రెండో పాట ‘పిచ్చి ప్రేమలో’ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాగా విడుదలైన మొదటి పాట “రుక్మిణి…” ప్రేక్షకులను విశేషంగా అలరించగా, ఇప్పుడు రెండో పాట రాక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో చిత్ర బృందం ఈ విషయాన్ని తెలియజేస్తూ కొన్నిసార్లు ‘పిచ్చి ప్రేమలో’ ఉండటం అత్యంత అందమైన అనుభూతి. ఆ మాయాజాలాన్ని మీకు అందించేందుకు మా రెండో పాట 13న విడుదల కానుంది అని పేర్కొంది.
ఈ చిత్రానికి మురళి రచన, దర్శకత్వం వహించగా ‘నేచురల్ స్టార్’ నాని సమర్పిస్తున్నారు. విడుదల చేసిన పోస్టర్‌లో నితిన్ (కృష్ణ పాత్రలో) ఆఫియా (రుక్మిణి పాత్రలో) కలిసి టీ తాగుతూ ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్నారు. 2026 ద్వితీయార్థంలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్, చాలా తక్కువ సమయంలోనే పూర్తి కావడంతో, చిత్ర బృందానికి ప్రమోషన్లు , పోస్ట్-ప్రొడక్షన్ పనుల కోసం తగినంత సమయం దొరికింది. ఇంతకు ముందు విడుదలైన మొదటి పాట “రుక్కు రుక్కు రుక్మిణి…” ఎంతో బాగుండి, తన రుక్మిణి పట్ల నితిన్ (కృష్ణ పాత్రలో) చూపే ప్రేమను చక్కగా ఆవిష్కరించింది. మరోవైపు కృష్ణ ప్రేమించే రుక్మిణి ఒక కఠినమైన ఉపాధ్యాయురాలు; పాఠశాలలోని విద్యార్థులు ఆమెను ముద్దుగా ‘డెవిల్’ అని పిలుస్తుంటారు. అంతకు ముందు చిత్ర బృందం నితిన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి, అతడిని ‘గరం గోపాల్’, ‘వ్రతం వెంకన్న’ వంటి రొమాంటిక్ పుస్తకాలతో ప్రాచుర్యం పొందిన రచయిత ‘కృష్ణ’గా పరిచయం చేసింది.
ఇటీవల విడుదలైన నితిన్ యంగ్ లుక్ పోస్టర్ కూడా అభిమానులను ఎంతగానో అలరించింది. డిసెంబర్ నెలలో ఇప్పటికే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పలు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలో, అదే తేదీన విడుదల కానున్న విశ్వక్ సేన్ చిత్రం ‘లెగసీ’ నాగ చైతన్య చిత్రం ‘వృషకర్మ’ లతో నితిన్ చిత్రం పోటీ పడాల్సి ఉంది.
