సుడిగాలి సుధీర్ దివ్య భార‌తి గోట్ మూవీ రిలీజ్

సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వేద వ్యాస్

hellotelugu-GoatRelease

హైద‌రాబాద్ : ప్రముఖ హాస్యనటుడి నుండి కథా నాయకుడిగా మారిన సుడిగాలి సుధీర్ నటించిన తాజా చిత్రం గోట్. ఈ చిత్రం న‌వంబ‌ర్ 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో దివ్య భారతి కథానాయికగా నటించగా వేదవ్యాస్ దర్శకత్వం వహించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ , జూదానికి వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని ఇచ్చే ఈ చిత్రాన్ని మహా తేజ క్రియేషన్స్ జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఏషియన్ సినిమాస్’ దీనిని సమర్పిస్తోంది. ఈ సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో మంచు మనోజ్ , నిర్మాత నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నేను సుడిగాలి సుధీర్‌కు అభిమానిని. టెలివిజన్ రంగం నుండి ఆయన ఎలా ఎదిగారో అందరికీ తెలిసిందే. ఆయన మరిన్ని మంచి చిత్రాలు చేసి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. గోట్ చిత్రం ఘనవిజయం సాధించాలని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. న

న‌టి దివ్య భారతి మాట్లాడుతూ గత రెండేళ్లుగా నేను ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. ఎట్టకేలకు ఈరోజు సినిమా విడుద‌ల కావ‌డం చాలా సంతోషంగా ఉందన్నారు. నా కెరీర్‌లో ఇది చాలా ముఖ్యమైన చిత్రం. ఇది కేవలం వినోదాత్మక చిత్రం మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న బెట్టింగ్ , జూదం వంటి సమస్యలను కూడా ఇది ఎత్తి చూపుతుంది. ఈ సినిమా ఒక బలమైన సామాజిక సందేశాన్ని కలిగి ఉందన్నారు న‌టి. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి కృషి ఎంతో ఉందని కొనియాడారు. అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ, ఎక్కడా రాజీ పడకుండా ఆయన ఈ సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాతో నాకు చాలా వ్యక్తిగతమైన, భావోద్వేగపూరితమైన అనుబంధం ఉంద‌ని చెప్పారు దివ్య భార‌తి. ఇది ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆ న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు.

దర్శకుడు వేదవ్యాస్ మాట్లాడుతూ ఆన్‌లైన్ బెట్టింగ్ భారత దేశ వ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తోంది. సుమారు 20 కోట్ల మంది దీనివల్ల నష్టపోయారని సమాచారం. ఈ సినిమా ఒక గ్రామం నేపథ్యంలో సాగుతుంది; అక్కడ ఎవరూ బెట్టింగ్‌కు పాల్పడ కూడదని గ్రామస్థులు నిర్ణయించుకుంటారు. ఆ గ్రామాన్ని కాపాడు కోవడానికి వారు చేసే పోరాటం, ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని, పెద్ద విజయాన్ని అందుకుంటుందని నమ్ముతున్నాను. హాస్యభరితమైన వినోదం , భావోద్వేగంతో కూడిన కథనం ద్వారా ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇందులో అందించానని చెప్పారు.

Exit mobile version