Ex CM KCR Health Shocking Update : మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం ప‌దిలం

య‌శోద హాస్పిట‌ల్ హెల్త్ బులిటెన్ విడుద‌ల

hellotelugu-kcrhealth

KCR : హైద‌రాబాద్ – బీఆర్ఎస్ బాస్, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది య‌శోద ఆస్ప‌త్రి యాజ‌మాన్యం. ఈ మేర‌కు ఆయ‌న‌కు అన్ని ప‌రీక్ష‌లు చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపింది. ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది. స్వల్ప నీరసంతో ఆసుపత్రిలో చేరారని యాజమాన్యం వెల్లడించింది. హై బ్లడ్ షుగర్, తక్కువ సోడియం లెవెల్స్‌తో కేసీఆర్ బాధపడుతున్నారని తెలిపింది. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొంది.

KCR Health Condition

ప్ర‌స్తుతం వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నార‌ని, డయాబెటిస్‌ను పర్యవేక్షిస్తున్నామని పేర్కొంది . ఇదిలా ఉండ‌గా గత కొంత కాలంగా కేసీఆర్ (KCR) త‌ర‌చూ అనారోగ్యానికి గుర‌వుతున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఆరోగ్య ప‌రీక్ష‌ల‌ను చేయించుకుంటున్నారు. ప్ర‌స్తుతానికి త‌ను ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. తన‌కు ఏమీ కాద‌ని, ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని కోరారు పార్టీ శ్రేణుల‌ను ఉద్దేశించి.

కేసీఆర్ య‌శోద ఆస్ప‌త్రిలో చేరార‌ని తెలుసుకున్న వెంట‌నే ఈ వార్త దావాన‌లంలా వ్యాపించింది. దీంతో తెలంగాణ రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి పెద్ద ఎత్తున హైద‌రాబాద్ కు చేరుకున్నారు. ట్రాఫిక్ కు ఇబ్బంది
ఏర్ప‌డుతుండ‌డంతో ముందు జాగ్ర‌త్త‌గా ఎక్క‌డిక‌క్క‌డ గులాబీ దళాల‌ను నిలిపి వేస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి సంతోష్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని, ప‌రామ‌ర్శించేందుకు వ‌స్తే ఎలా అడ్డుకుంటారంటూ ప్ర‌శ్నించారు. దీనిపై వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు పోలీసులు.

ఆస్ప‌త్రిలో ఉన్న కేసీఆర్ ను కొడుకు కేటీఆర్, అల్లుడు హ‌రీశ్ రావు, కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత‌తో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ విభాగాల బాధ్యులు ప‌రామ‌ర్శించారు.

Also Read : America Independence Day Special : నేడే 249వ అమెరికా ఇండిపెండెన్స్ డే

Exit mobile version