చెన్నై : తమిళనాడు సర్కార్ అరుదైన ఘనత సాధించింది. భారీ ఎత్తున పరిశ్రమల ఏర్పాటుపై సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ దృష్టి సారించారు. 200 రోజుల క్రితం ఒక వాగ్దానంతో ప్రారంభించారు. ఈ రోజు అది 190 అవగాహన ఒప్పందాలు ₹1.73 లక్షల కోట్ల పెట్టుబడులతో 2 లక్షల ఉద్యోగాలుగా రూపుదిద్దుకుందని ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం . ఇందులో భాగంగా రూ. 58,214 కోట్ల విలువైన 78 కొత్త అవగాహన ఒప్పందాలు , 65,786 ఉద్యోగాలు. 13 కంపెనీలు మొదటిసారిగా తమిళనాడుకు 4 కంపెనీలు వచ్చాయన్నారు. ₹9,355 కోట్ల విలువైన 15 శంకుస్థాపనలు , 6 ప్రారంభోత్సవాలు 21,675 ఉద్యోగాలన కల్పన జరిగిందన్నారు. తాము ఇంతకు ముందు సంతకం చేసిన 112 అవగాహన ఒప్పందాలలో 74.1% ఇప్పటికే కార్యరూపం దాల్చాయని చెప్పారు.
ఈ సందర్బంగా సీఎం విజయ్ కి ధన్యవాదాలు తెలిపారు మంత్రి కీర్తన. ఉన్నత ప్రమాణాలను నిర్దేశించి, వాటిని చేరుకుంటామని మమ్మల్ని విశ్వసించినందుకు ఆనందంగా ఉందన్నారు. మా విజయ రహస్యం ఏమిటో ఎవరైనా తెలుసు కోవాలనుకుంటే అందులో ఘాటైనదేమీ లేదు, కేవలం కలిసికట్టుగా పనిచేసే ఒక బృందం మాత్రమేనని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా చెన్నైలో జరిగిన ‘వెట్రి తమిళనాడు ఇన్వెస్ట్మెంట్ అండ్ కన్వర్షన్ కాంక్లేవ్’ లో, పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహం, వాణిజ్య శాఖ తరపున 78 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా రూ. 58,214 కోట్ల పెట్టుబడులు రానుండగా, 65,786 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా, ముఖ్యమంత్రి రూ. 7,925 కోట్ల పెట్టుబడితో చేపట్టే 15 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వీటి ద్వారా 19,965 మందికి ఉపాధి లభిస్తుంది. అనంతరం, ఆయన రూ. 1,430 కోట్ల పెట్టుబడితో కూడిన ఆరు ప్రాజెక్టులను ప్రారంభించారు, వీటి ద్వారా 1,710 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అలాగే ఐదు కంపెనీలలో వివిధ ఉద్యోగాలకు ఎంపికైన 18 మంది అభ్యర్థులకు ఆయన నియామక పత్రాలను అందజేశారు.



















