CM Revanth Reddy Challenge : దేశంలోనే తెలంగాణ‌ను నెంబ‌ర్ వ‌న్ చేస్తా

ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి

Hello Telugu - CM Revanth Reddy Challenge

Hello Telugu - CM Revanth Reddy Challenge

CM Revanth Reddy : హైద‌రాబాద్ – ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల‌లో నెంబ‌ర్ వ‌న్ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. 2047 సంవ‌త్స‌రం నాటికి మూడు ట్రిలియ‌న్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా మారుస్తాన‌ని అన్నారు. తెలంగాణ రైజింగ్ ప్లాన్ ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని స్ప‌ష్టం చేశారు. పేదలకు సహాయం చేస్తుందని, రాష్ట్రాన్ని ప్రపంచ శక్తి కేంద్రంగా మారుస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). శ్రీ‌రామ్ రాసిన కవితా సంక‌ల‌నాన్ని సీఎం ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ తెలంగాణ ఇప్పుడు దూసుకు పోతోంద‌న్నారు. తాము కొలువు తీరాక స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కోసం ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టామ‌న్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ప్లాన్ చేశామ‌న్నారు. ఇప్ప‌టికే యాక్ష‌న్ ప్లాన్స్ త‌యారు చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy Challenge

ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసే ప‌నిలో ప‌డ్డామ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వం చేసిన అప్పుల కుప్ప‌ను తీర్చేందుకు నానా తంటాలు ప‌డుతున్నామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే రైజింగ్ తెలంగాణ పేరుతో చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్-2047 కేవలం ఒక దార్శనికత మాత్రమే కాదని, రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి, అభివృద్ధి ద్వారా పేదల జీవితాలను మార్చడానికి ఒక ఆచరణాత్మక ప్రణాళిక అని అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, పేదలకు లక్షలాది ఇళ్లు అందించడం, చక్కటి బియ్యం పంపిణీ, అర్హులైన అన్ని కుటుంబాలకు రేషన్ కార్డులు, వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచడం వంటివి ఇప్ప‌టికే చేప‌ట్ట‌మ‌న్నారు.

Also Read : IMD Warning Telangana : తెలంగాణ‌కు హై అల‌ర్ట్ – ఐఎండీ

Exit mobile version