IMD : హైదరాబాద్ – రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి జన జీవనం స్తంభించి పోయింది. ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. భారీ వర్షాల తాకిడికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి. ఇదిలా ఉండగా ఐఎండీ (IMD) హై అలర్ట్ చేసింది. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. వర్షాల నేపత్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. వరదల బీభత్సంపై సమీక్ష చేపట్టారు. రక్షణ, పారిశుధ్యం, వైద్య సంరక్షణ అధికారులు సమన్వయం చేసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.
IMD Warning to Telangana
ఈ సందర్భంగా హైడ్రా రంగనాథ్ నగరంలో చేపట్టిన సహాయక చర్యల గురించి వివరించారు. అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టామని, పలు చోట్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. నిన్న భారీ ఎత్తున వర్షాలు కురిశాయి. ఆదివారం కూడా కురుస్తూనే ఉన్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలు వర్షాల తాకిడికి తల్లడిల్లి పోయాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ ప్రకారం 15 జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అలర్ట్ గా ఉండాలని ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఇప్పటికే ఆయా జిల్లాలకు విపత్తు నిర్వహణ పనుల కోసం నిధులు విడుదల చేశామన్నారు.
Also Read : Jagadish Reddy Shocking Comments : బనకచర్లపై బాబుకు రేవంత్ మద్దతు దారుణం
