CM Revanth Reddy – Upasana Konidela Proven : చిరంజీవి కోడ‌లు ఉపాస‌న‌కు కీల‌క బాధ్య‌త‌లు

అప్ప‌గించిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

Hello Telugu - CM Revanth Reddy - Upasana Konidela Proven

Hello Telugu - CM Revanth Reddy - Upasana Konidela Proven

CM Revanth Reddy  : హైద‌రాబాద్ – తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌కు ఉపాసన కొణిదెల కో-ఛైర్మన్‌గా నియామకం అయ్యారు. క్రీడా రంగాలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం నియమించిన ఈ బోర్డుకు ఛైర్మన్‌గా సంజయ్ గోయెంకా ఉన్నారు. తెలంగాణను ప్రపంచ క్రీడా శక్తిగా మార్చేందుకు కృషి చేస్తానని, సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) కృతజ్ఞతలు తెలిపారు ఉపాస‌న కొణిద‌ల‌. ఆమె రామ్ చ‌ర‌ణ్ భార్య‌. త‌న తాత అపోలో సంస్థ‌ల అధినేత‌. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో కొత్త‌గా కొలువు తీరిన రేవంత్ రెడ్డి స‌ర్కార్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు కొంత విస్తు పోయేలా చేస్తున్నాయి. ఇప్ప‌టికే ఏపీకి చెందిన ప‌లువురికి ప్ర‌యారిటీ ఇచ్చార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. మ‌రో వైపు టీడీపీ నుంచి పార్టీలో చేరిన వారికి ఎక్కువ శాతం నామినేటెడ్ ప‌ద‌వుల‌తో పాటు త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన వారికి అత్య‌ధిక పోస్టులు ఇచ్చార‌ని బీసీ సంఘాల నాయ‌కులు మండిప‌డ్డారు. ఈ మేర‌కు ఇదే విష‌యాన్ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు.

CM Revanth Reddy Gives Key Responsibilities

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న కొణిద‌ల‌కు కీల‌క ప‌ద‌వి అప్ప‌గించారు.
తెలంగాణలో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో కాంగ్రెస్ సర్కార్ ‘స్పోర్ట్స్ పాలసీ 2025’ను తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి తాజాగా ‘స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ’ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు చైర్మన్‌గా సంజీవ్ గోయెంకాను నియమించింది. మెగా కోడలు ఉపాసన కామినేనిని కో చైర్మన్‌గా నియమించింది. అధికారికంగా స‌ర్కార్ ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది. ఈ నియామ‌కం త‌న‌పై మ‌రంత బాధ్య‌త‌ను పెంచింద‌ని, ఇదే స‌మ‌యంలో సంజీవ్ గోయెంకాతో క‌లిసి ప‌ని చేసే ఛాన్స్ రావ‌డం ఆనందంగా ఉందంటూ ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.

Also Read : Telugu Film Workers Fired on Mythri Makers : ప‌వ‌న్ క‌ళ్యాణ్ , మైత్రీ మేక‌ర్స్ పై సినీ కార్మికుల ఫైర్

Exit mobile version