AP Govt Important Update on DSC Holders : డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

2026 జ‌న‌వ‌రిలో ఏపీ డీఎస్సీ నోటిఫికేష‌న్

Hello Telugu - AP Govt Important Update on DSC Holders

Hello Telugu - AP Govt Important Update on DSC Holders

AP Govt : అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు, నిరుద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పింది. వ‌చ్చే ఏడాది 2026లో మ‌రోసారి టీచ‌ర్ల భ‌ర్తీకి సంబంధించి ప్ర‌క్రియ చేప‌డ‌తామ‌ని ప్ర‌క‌టించారు ఏపీ (AP Govt) విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. జ‌న‌వ‌రిలో నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని, మార్చి నెల‌లో డీఎస్సీ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది న‌వంబ‌ర్ నెల‌లో టెట్ (ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌)ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు మంత్రి. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు నారా లోకేశ్. ప్రతిఏటా డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామ‌న్నారు.

AP Govt Key Update

ఇందులో భాగంగా నవంబర్ చివరి వారంలో టెట్ చేప‌డ‌తామ‌న్నారు. వ‌చ్చే ఏడాదిలో టీచర్ పోస్టులను భర్తీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు నారా లోకేష్. టెట్, డిఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కొత్త డిఎస్సీ నిర్వహణ తర్వాత వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి. 2026 జనవరి లో నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సీ, స్పెషల్ డిఎస్సీ నిర్వహిస్తాం అన్నారు. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలపై లక్ష్య సాధనకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు నారా లోకేష్. బేస్ లైన్ టెస్ట్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 78 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను మెరుగైన విద్యా ప్రమాణాలపై అధ్యయనానికి సింగపూర్ పర్యటనకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని స్ప‌ష్టం చేశారు.

Also Read : Tejashwi Yadav Sensational Comments : ప‌వ‌ర్ లోకి వస్తే ప్ర‌తి ఇంట్లో ఒక‌రికి జాబ్

Exit mobile version