CM Revanth Reddy : హైదరాబాద్ – న్యాయం అంటే శిక్షలు విధించడమే కాదు బాధితులకు మేమున్నామంటూ భరోసా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్ అనే థీమ్ తో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం చాలా అవసం అన్నారు. లైంగిక వేధింపుల నుంచి అన్ని రకాలుగా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం పిల్లలు, మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. బాలికల సంరక్షణ కోసం తెలంగాణ భరోసా ప్రాజెక్టును తీసుకొచ్చామని చెప్పారు.
CM Revanth Reddy Interesting Comments
క్రైమ్ రేట్ లో తెలంగాణ జీరోకు రావాలని అన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే మహిళల భద్రత కోసం పలు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా షీ టీమ్స్ అద్భుతంగా పని చేస్తున్నాయని కితాబు ఇచ్చారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుండాలని, వేధింపులకు పాల్పడే వారిని ఓ కంట కనిపెట్టాలని పేర్కొన్నారు. ప్రధానంగా మహిళలు, బాలికలు, యువతులు, చిన్నారుల పట్ల వేధింపులకు పాల్పడే వారు టచ్ చేస్తే శిక్షిస్తారన్న భయం ఉండాలని అన్నారు. లేకపోతే మరింత రెచ్చి పోయే ప్రమాదం పొంచి ఉందన్నారు.
తమ సర్కార్ ఎవరినీ ఉపేక్షించ బోదని మరోసారి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ కొందరు నేరాలకు పాల్పతుండడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కీలక సమయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు.
Also Read : AP High Court Clear Instructions : సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో అత్యుత్సాహం వద్దు
