AP High Court : అమరావతి – సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో అత్యుత్సాహంతో రిమాండ్ చేయొద్దంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైకోర్టు (AP High Court) ప్రధాన న్యాయమూర్తులకు కీలకమైన ఆదేశాలు జారీ అయ్యాయి. తీర్పు చెప్పే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించింది. ఈ మధ్యన వీటిపై ట్రోల్స్ పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి. ఈ సందర్బంగా తాజాగా రాష్ట్రంలోని జడ్డీలందరికీ సర్క్యులర్ జారీ చేశారు హైకోర్టు రిజిస్ట్రార్. యాంత్రికంగా రిమాండ్ విధించడం సరి కాదంటూ పేర్కొన్నారు.
AP High Court Instructions to Judges
దీనికి సంబంధించి మెజిస్ట్రేట్లు విధిగా గతంలో భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. చట్టాన్ని ఏ మాత్రం ఉల్లంఘించినా ఉపేక్షించే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. ఒకవేళ చేస్తే వారు కోర్టు థిక్కారం కేసు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. ఇంకా వారిపై శాఖాపరమైన చర్య కూడా ఉంటుందని వెల్లడించారు.
ఏపీలో ఇటీవల సోషల్ మీడియా పోస్ట్‌లు, కామెంట్స్‌కు సంబంధించి నమోదైన కేసులు, అరెస్టులు, రిమాండ్స్‌కు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు సర్క్యులర్ చేయడం కలకలం రేపింది. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ లేదా కామెంట్‌కు సంబంధించి పలు స్టేషన్లలో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి.
దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను ఆధారంగా చేసుకుని ఎలా పడితే అలా కేసులు నమోదవుతున్నాయి. దీనిని గుర్తించేందుకు ఫ్యాక్ట్ చెక్ అనే టూల్ కూడా ఉంది. చాలా సంస్థలు దీనిని వాడుకుంటున్నాయి. ఇదే క్రమంలో సీజేఐ సీరియస్ గా దీనిని పరిశీలించాలని ఇప్పటికే పేర్కొన్నారు.
Also Read : Elon Musk Shocking Trump : ది అమెరికా పార్టీ పేరుతో ఎలాన్ మస్క్ కొత్త పార్టీ
