CM Revanth Reddy : హైదరాబాద్ – తనపై, మాజీ మంత్రి హరీశ్ రావుపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). తామిద్దరం కలిసి ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్లామని, విమానంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతికి సంబంధించి విచారణ చేపట్టకుండా ఉండేందుకు తన కాళ్లు హరీశ్ రావు పట్టుకున్నాడని కవిత చెప్పడం దారుణమన్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు తమ తమ అవసరాల నిమిత్తం ఒక చోట కలుసుకుంటారని, ఒకే ఫ్లైట్ లో ప్రయాణం చేస్తుంటారని అలాంటప్పుడు ఇలాంటి చవకబారు ఆరోపణలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబంలో చోటు చేసుకున్న విభేదాల కారణంగా ఒక్కటొక్కటి బయటకు వస్తోందన్నారు రేవంత్ రెడ్డి. ముందు మీ ఫ్యామిలీ చక్క బెట్టుకుని బయటి వ్యక్తులను అనాలని అన్నారు. అయినా కేసీఆర్ అనేటోడు చచ్చిన పాము లాంటోడని ఎద్దేవా చేశారు. ఇంకా చచ్చిన పామును తాను ఎందుకు చంపుతానంటూ ప్రశ్నించారు.
CM Revanth Reddy Slams Ex MLC Kavitha
నిరాధారమైన ఆరోపణలు చేయడం కవిత మానుకోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తనపై ఆమె చేసిన ఆరోపణలన్నీ బక్వాస్ అంటూ కొట్టి పారేశారు. ఇదిలా ఉండగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై బిఆర్ఎస్ సస్పెండ్ చేసిన కొన్ని గంటల తర్వాత కవిత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తు ప్రకటించడంతో, కవిత తన బంధువు, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు ,బిఆర్ఎస్ అధినేత, ఆమె తండ్రి కె. చంద్రశేఖర్ రావు ప్రతిష్టను కావాలని దెబ్బ తీశారని ఆరోపించారు.
హరీష్ రావు బిజెపితో టచ్‌లో ఉన్నారని, బిఆర్ఎస్ నియంత్రణను చేజిక్కించు కోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : CM Chandrababu Fired on YSRCP : రైతుల ముసుగులో వైసీపీ రాజకీయం : సీఎం
