CM Chandrababu Fired on YSRCP : రైతుల ముసుగులో వైసీపీ రాజకీయం : సీఎం

జ‌గ‌న్ రెడ్డిపై చంద్ర‌బాబు నాయుడు ఆగ్ర‌హం

Hello Telugu - CM Chandrababu Fired on YSRCP

Hello Telugu - CM Chandrababu Fired on YSRCP

CM Chandrababu : అమ‌రావ‌తి – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఫేక్ ప్రచారంతో విష విత్తనాలు జల్లుతున్నారని ఆరోపించారు. ఎరువుల రవాణాను అడ్డుకుంటూ వైసీపీ డ్రామాలు ఆడుతోందన్నారు. రైతుల ముసుగులో వైసీపీ రాజకీయం చేస్తోంద‌ని మండిప‌డ్డారు సీఎం. వైసీపీ దుష్ప్రచారంతో రైతులు ఆందోళన చెందొద్దని, వారి రాజకీయ ఉచ్చులో పడొద్ద‌ని కోరారు. సమృద్ధిగా ఎరువుల నిల్వలున్నాయని స్ప‌ష్టం చేశారు. ఎరువుల సరఫరాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్ని విషయాల్లోనూ ఫేక్ ప్రచారం చేస్తున్న వైసీపీ ఎరువుల విషయంలోనూ అదే తరహా దుష్ప్రచారాన్ని చేస్తోందని ధ్వ‌జ‌మెత్తారు .జిల్లాల వారీగా ఎరువుల సరఫరా లెక్కలను చంద్రబాబు (CM Chandrababu) వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.

CM Chandrababu Slams YSRCP

ఈ ఖరీఫ్ సీజనులో ఓపెనింగ్ బ్యాలెన్సుతో కలిపి 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేశామ‌న్నారు. ఇప్ప‌టి దాకా 94,892 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఇది కాకుండా గత 10 రోజుల్లో సుమారు 28 వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేశామ‌న్నారు. వచ్చే 10 రోజుల్లో 30 వేల టన్నులు సరఫరాకు అందుబాటులోకి రానుందని చెప్పారు. తాజాగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరో 53 వేల టన్నుల కేటాయింపులు తెచ్చుకున్నామ‌ని తెలిపారు. సెప్టెంబర్ 12 నుంచి 30వ తేదీ లోపు మరో లక్ష టన్నులు రాష్ట్రానికి రానున్నాయ‌ని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు. సెప్టెంబర్ నెలఖరు నాటికి 2.71 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుంద‌న్నారు. రైతులు ఆందోళన చెంద వ‌ద్ద‌ని కోరారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు ఎరువులను సిద్దం చేస్తామ‌న్నారు. వచ్చే రబీ నాటికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 9.38 లక్షల టన్నులు కేటాయింపులు ఇప్పటికే చేసుకున్నామ‌ని తెలిపారు.

Also Read : Yamuna River Sensational : య‌మునా న‌ది ఉగ్ర‌రూపం ఢిల్లీ అత‌లాకుత‌లం

Exit mobile version