CM Revanth Reddy : హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత పి. జనార్దన్ రెడ్డి కుటుంబాన్ని కావాలని మాజీ సీఎం కేసీఆర్ అవమానించాడని మండిపడ్డారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీరియస్ అయ్యారు. అందుకే కేసీఆర్ నే ఓడించి ఫార్మ్ హౌస్ కి పంపామన్నారు. అయినా తండ్రీ కొడుకులకు సోయి రావడం లేదంటూ ఎద్దేవా చేశారు. యూసఫ్ గూడ చెక్ పోస్ట్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొని ప్రసంగించారు. పేదోళ్ల గుండె ధైర్యం పీజేఆర్ అని అన్నారు. 2007 లో పీజేఆర్ మరణించినపుడు ఏకగ్రీవం చేయడానికి చంద్రబాబు నాయుడు అభ్యర్థి ని నిలబెట్టలేదని చెప్పారు. కానీ కేసీఆర్ మాత్రం పీజేఆర్ కుటుంబాన్ని మూడు గంటలు ఎండలో నిలబెట్టి అవమానించాడని ఆవేదన వ్యక్తం చేశారు.
CM Revanth Reddy Slams KCR
ఉపఎన్నికలో కేసీఆర్ మాత్రం పీజేఆర్ కుటుంబం పైన అభ్యర్థిని నిలబెట్టాడని ఫైర్ అయ్యారు. మాగంటి గోపి సతీమణిని గెలిపించాలని కేటీఆర్, హరీష్ రావు సెంటిమెంట్ పేరు తో తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. జూబ్లీ హిల్స్ లో గత 10 ఏళ్లు బీఆర్ ఎస్, బీజేపీనే అధికారం లో ఉన్నాయన్నారు. మరి ఇన్నాళ్లుగా అధికారంలో ఉన్న మీరు ఎందుకు అభివృద్ది చేయలేదంటూ ప్రశ్నించారు సీఎం. నక్కలు మేక తోలు కప్పుకొని వస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కృష్ణా నగర్ ఇప్పుడు ఆస్కార్ అవార్డు లు తీసుకు వస్తోందన్నారు. ఆనాటి నుంచి నేటి దాకా కాంగ్రెస్ ప్రభుత్వాలు సినిమా పరిశ్రమకు అండగా నిలబడ్డాయని చెప్పారు. కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా నంది అవార్డు లు ఇవ్వలేదన్నారు. దీనిపై సమాధానం చెప్పాలన్నారు.
Also Read : Minister Ponnam Prabhakar Interesting Comments : ప్రజా పాలన వైపు ప్రజలు చూపు
