Minister Ponnam Prabhakar Interesting Comments : ప్ర‌జా పాల‌న వైపు ప్ర‌జ‌లు చూపు

మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కామెంట్స్

Hello Telugu - Minister Ponnam Prabhakar Interesting Comments

Hello Telugu - Minister Ponnam Prabhakar Interesting Comments

Ponnam Prabhakar : హైద‌రాబాద్ : రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న ప్ర‌భుత్వం ప‌ట్ల ప్ర‌జ‌లు న‌మ్మ‌కంగా ఉన్నార‌ని అన్నారు రాష్ట్ర రోడ్లు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ (Ponnam Prabhakar). జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. ఈనెల 11న పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా 14న ఫ‌లితాలు ప్ర‌క‌టించ‌నుంది రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం. ఈ సంద‌ర్బంగా ఆయా పార్టీల నేత‌లు పెద్ద ఎత్తున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. త‌మ పార్టీల అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని కోరుతున్నారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మంత్రి మాట్లాడారు. ప‌లువురు ఓట‌ర్ల‌ను స్వ‌యంగా క‌లుసుకున్నారు. త‌మ‌కు ఓటు వేసి గెలిపించాల‌ని కోరారు. న‌వీన్ యాద‌వ్ బీసీ నాయ‌కుడ‌ని, పేద‌ల‌కు అందుబాటులో ఉండే వ్య‌క్తి అని పేర్కొన్నారు.

Minister Ponnam Prabhakar Comments

యూసుఫ్ గూడ డివిజన్ లోని శ్రీకృష్ణ నగర్ లో డోర్ టు డోర్ ప్ర‌చారం చేప‌ట్టడం ఆనందంగా ఉంద‌న్నారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. ఆయ‌న అంద‌రినీ ఆప్యాయంగా పలకరిస్తూ ,ప్రజా పాలన ప్రభుత్వం లో అమలు చేస్తున్న పథకాలు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు . ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్కొకరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తుందని ,200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్ సిలిండర్, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, మహిళలకు ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్.

Also Read : DY CM Bhatti Vikramarka Important Update : హైద‌రాబాద్ లో వ‌ర‌ల్డ్ క్లాస్ ఫిలిం సిటీ

Exit mobile version