CM Revanth Reddy Warning : కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్

క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించాల్సిందే

Hello Telugu - CM Revanth Reddy Warning

Hello Telugu - CM Revanth Reddy Warning

CM Revanth Reddy : హైద‌రాబాద్ – సీఎం ఎ. రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. సోమవారం క‌లెక్ట‌ర్లతో స‌మీక్ష చేప‌ట్టారు. ఏ మాత్రం అజాగ్రత్త, నిర్లక్ష్యంగా ఉన్నా ఎంతటి అధికారిని నైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. రైతులు, పేద ప్రజలకు అధికారుల మూలానా ఏమాత్రం నష్టం జరిగినా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంద‌ని వార్నింగ్ ఇచ్చారు. ఈనెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డులు పంపిణీ చేయాలని స్ప‌ష్టం చేశారు. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ఇంఛార్జి మంత్రి కలిసి రేషన్ కార్డులు పంపిణి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). IAS అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాల‌ని లేక‌పోతే ఒప్పుకోమ‌న్నారు.

CM Revanth Reddy Mass Warning

అధికారులు ఆకస్మికంగా ఫీల్డ్ విజిట్ చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్లు సడెన్ విజిట్స్ చేస్తే కిందిస్థాయి అధికారులు అలెర్ట్ గా ఉంటారన్నారు సీఎం. డే లో ఫస్ట్ హాఫ్ మొత్తం ఫీల్డ్ విజిట్ చేసి సెకండ్ హాఫ్ మొత్తం ఆఫీసులో ఉండాలన్నారు . ఇదిలా ఉండ‌గా అంత‌కు ముందు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆదివాసీ సంఘాల నాయకులు.

కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో టైగర్‌ కన్జర్వేషన్‌ రిజర్వ్‌ కు సంబంధించిన జీవో నంబర్‌ 49ని ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివాసీ బిడ్డ‌ల ఆక్రంద‌న‌ల‌ను సీఎం స్వ‌యంగా విన్నార‌ని, ఆ మేర‌కు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెప్ఆప‌రు మంత్రి సీత‌క్క‌. బీఆర్ఎఎస్ నాయ‌కులు కావాల‌ని త‌మ స‌ర్కార్ ను బ‌ద్నాం చేయాల‌ని చూస్తున్నారంటూ ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. తాము మాట ఇవ్వ‌మ‌ని, ఇస్తే త‌ప్ప‌మ‌ని పేర్కొన్నారు.

Also Read : Minister Narayana – Amaravati Growth : అమ‌రావ‌తిలో శ‌ర‌వేగంగా పనులు – నారాయ‌ణ

Exit mobile version