CM Revanth Reddy : హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే తెలంగాణ పెట్టుబడులను ఆకర్షించడంలో ముందంజలో ఉందన్నారు. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ రంగాలలో దూసుకు పోతోందన్నారు. ఈ సందర్బంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ఆవిష్కరణలకు కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు కలిసి వచ్చే వారితో ముందుకు సాగాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఈసందర్బంగా జర్మనీ సహాయం చేయాలని కోరారు సీఎం. జర్మనీ కాన్సుల్ జనరల్ మైఖేల్ మోస్పర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. ఈ సందర్బంగా పలు కీలక అంశాలపై సుదీర్గంగా చర్చించారు.
CM Revanth Reddy Key Comments
హైదరాబాద్ నగరంలోని విద్యార్థులకు జర్మన్ భాష బోధించేందుకు టీచర్లను నియమించాలని కూడా సూచించారు. ఈ సందర్బంగా జర్మనీ ప్రభుత్వం విస్తారంగా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధానికి తెలియ చేయాలని కోరారు రేవంత్ రెడ్డి జర్మనీ కాన్సుల్ జనరల్ హోస్పర్ కు. ఐటి, ఫార్మా, ఆటోమొబైల్ రంగాలలో తెలంగాణ రాష్ట్రం టాప్ లో కొనసాగుతోందని చెప్పారు. ఈ రంగాలలో ఇన్వెస్ట్ చేయాలని సూచించారు. దీని వల్ల ఎలాంటి సాయం కావాలన్నా సర్కార్ మద్దతు ఇస్తుందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు ఎక్కువగా తాము ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.
Also Read : Minister Sridharbabu Important Update : ఏఐ హబ్ గా తెలంగాణ : శ్రీధర్ బాబు
