Deputy CM Pawan Interesting Comments : పునర్వ్యవస్థీకరణతో ప‌ల్లె పంచాయతీలు బలోపేతం

అబ్దుల్ క‌లాం స్పూర్తితో ముందుకు సాగుతాం

Hello Telugu - Deputy CM Pawan Interesting Comments

Hello Telugu - Deputy CM Pawan Interesting Comments

Deputy CM Pawan : అమ‌రావ‌తి : పునర్వ్యవస్థీకరణతో ప‌ల్లె పంచాయతీలు బలోపేతం అవుతాయ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Deputy CM Pawan). స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా గ్రామ పంచాయతీలను చేస్తామ‌న్నారు. ఇక నుంచి ఉన్న‌ క్లస్టర్ వ్యవస్థ రద్దు చేస్తామ‌న్నారు. 10 వేలు జనాభా దాటిన పంచాయతీలకు రూర్బన్ పంచాయతీలుగా గుర్తింపు ఇస్తామ‌న్నారు డిప్యూటీ సీఎం. పట్టణ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనతో రూర్బన్ పంచాయతీలు ఉండ‌నున్నాయ‌ని తెలిపారు. నాలుగు గ్రేడ్లుగా పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ ఉంటుంద‌న్నారు. ఇక నుంచి గ్రామ కార్యదర్శి పేరు పంచాయతీ అభివృద్ధి అధికారి (పి.డి.ఓ.)గా మారుస్తామ‌ని ప్ర‌క‌టించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. పంచాయతీరాజ్ లో ప్రత్యేక ఐటీ విభాగం ఏర్పాటు చేస్తామ‌న్నారు. గ్రామ పంచాయతీల్లో పరిపాలనా సంస్కరణలకు మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింద‌న్నారు.

Deputy CM Pawan Kalyan Comments

పంచాయతీరాజ్ పరిపాలన సంస్కరణలపై ఫోక‌స్ పెట్టామ‌న్నారు. ఈ మేర‌కు గ‌త కొన్ని రోజులుగా స‌మీక్ష‌లు చేప‌డుతూ వ‌స్తున్నామ‌న్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చొరవతో గ్రామ పంచాయతీల్లో పారదర్శకతతో కూడిన పాలన అందించేందుకు ఈ నూతన విధానాలకు రూపకల్పన చేశారు. మాజీ రాష్ట్రపతి డా.అబ్దుల్ కలాం పల్లెల్లో మౌలిక వసతులు మెరుగు పరచడానికి, పౌర సేవలు సక్రమంగా అందేలా పాలన వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని చెప్పారని గుర్తు చేశారు డిప్యూటీ సీఎం. ఆ స్ఫూర్తిని ఆచరణలోకి తీసుకువచ్చేలా సంస్కరణలకు శ్రీకారం చుట్టామ‌న్నారు. పంచాయతీరాజ్ పరిపాలన సంస్కరణలపై ఆయన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఈ శాఖల ఉన్నతాధికారులు, పంచాయతీరాజ్ వ్యవస్థపై అధ్యయనం చేసిన నిపుణులతో నాలుగు నెలల పాటు పలు దఫాలు చర్చలు చేశారు.

Also Read : Hydraa Huge Relief : క‌బ్జాకు గురైన పార్కు స్థ‌లాల‌ను కాపాడిన హైడ్రా

Exit mobile version