CM Revanth Reddy Interesting Comments : రామోజీ రావు పేరు కాదు ఓ బ్రాండ్ : సీఎం

రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం

Hello Telugu - CM Revanth Reddy Interesting Comments

Hello Telugu - CM Revanth Reddy Interesting Comments

CM Revanth Reddy : హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దివంగ‌త రామోజీ రావును ఆకాశానికి ఎత్తేశారు. ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. రామోజీ రావు ఎక్స‌లెన్స్ అవార్డుల ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ లోని రామోజీ ఫిలిం స్టూడియోలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా ఉప రాష్ట్ర‌ప‌తి రాధాకృష్ణ‌న్, మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు, కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డిల‌తో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఎ. రేవంత్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా సీఎం ప్ర‌సంగించారు. రామోజీ రావు పేరు కాద‌ని ఆయ‌న ఓ బ్రాండ్ అని కొనియాడారు. రామోజీ రావు అందించిన విలువలు, సంప్రదాయాలను కొనసాగిస్తున్న రామోజీ గ్రూప్ ను అభినందిస్తున్నాన‌ని అన్నారు.

CM Revanth Reddy Key Comments on The Great Ramoji Rao

సంస్థలను నిర్వహించడం అంత ఆషామాషీ కాదని చెప్పారు రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి రామోజీ ఫిల్మ్ సిటీ ఒక గొప్ప ఎస్సెట్ అని ప్ర‌శంసించారు. రాష్ట్రంలో నాలుగు వండర్స్ ఉన్నాయని అనుకుంటే అందులో ఒకటి చార్మినార్, రెండోది గోల్కొండ, మూడోది హైటెక్ సిటీ నాలుగో వండర్ గా రామోజీ ఫిలిం సిటీ నిలిచింద‌న్నారు రేవంత్ రెడ్డి. స్క్రిప్ట్ తో వచ్చి ప్రింట్ తీసుకుని వెళ్లండి అని రామోజీ ఫిలిం సిటీని ప్రారంభించినప్పుడు రామోజీ రావు అనే వార‌ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఫిల్మ్ సిటీని ఆస్థాయిలో తీర్చిదిద్దారని పేర్కొన్నారు. నిద్ర లేవగానే ఈనాడు చదవడం నిద్రపోయే ముందు ఈటీవీ వార్తలు చూడడం అందరికీ అలవాటుగా మారి పోయింద‌న్నారు.

Also Read : MP Eatala Rajender Important Meet : ఫ్లై ఓవ‌ర్ నిర్మాణాలు వేగ‌వంతం చేయండి

Exit mobile version