MP Eatala Rajender Important Meet : ఫ్లై ఓవ‌ర్ నిర్మాణాలు వేగ‌వంతం చేయండి

కేంద్ర మంత్రి గ‌డ్క‌రీని క‌లిసిన ఈటెల రాజేంద‌ర్

Hello Telugu - MP Eatala Rajender Important Meet

Hello Telugu - MP Eatala Rajender Important Meet

Eatala Rajender : మ‌హారాష్ట్ర : ఫ్లై ఓవ‌ర్ నిర్మాణాలను మ‌రింత వేగ‌వంతం అయ్యేలా చేయాల‌ని కోరారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద‌ర్. ఆదివారం మ‌హారాష్ట్ర‌లోని నాగ‌పూర్ లో కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీని (Nitin Gadkari) క‌లిశారు. ఎంపీతో పాటు బీజేఎల్పీ నేత‌, నిర్మ‌ల్ ఎమ్మెల్యే ఆలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి. ముధోల్ ఎమ్మెలే ప‌వార్ రామారావు ప‌టేల్ కూడా ఉన్నారు. ప్ర‌త్యేకంగా హైదరాబాద్ లో నిర్మాణం అవుతున్న ఫ్లై ఓవర్ ల గురించి చర్చించారు. కోటికి పైగా ఉన్న జనాభా, వచ్చి పోయే మరో అరకోటి మంది ప్రజలతో హైదరాబాద్ విశ్వ నగరం నిత్యం రద్దీగా ఉంటుందన్నారు. హైదరాబాద్ లో ప్రజలు ట్రాఫిక్ జామ్ లతో అష్ట కష్టాలు పడుతున్నారని తెలిపారు. ఆఫీసులలో పని చేసే సమయం కంటే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే సమయమే ఎక్కువ ఉందంటూ ప్రజలు వాపోతున్నారని కేంద్ర మంత్రికి విన్న‌వించారు.

MP Eatala Rajender Meet Union Minister Nitin Gadkari

పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మాలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంద‌న్నారు. అందుకోసం అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఫ్లై ఓవర్ ల నిర్మాణం చేపడుతున్నా పనులు నత్తనడక నడవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వరంగల్ హైవేలో నిర్మిస్తున్న ఉప్పల్ ఫ్లైఓవర్ నిజామాబాద్ హైవేలో నిర్మిస్తున్న కొంపల్లి ఫ్లై ఓవర్ పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని దాని కోసం తగిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు ఈటెల రాజేంద‌ర్ (Eatala Rajender). దీనిపై సానుకూలంగా స్పందించార‌ని చెప్పారు ఎంపీ. వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని తెలిపారన్నారు.

అంతే కాకుండా బాలానగర్ – నరసాపూర్ హైవేలో కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరగడం వల్ల ఆ రూట్ లో కూడా ఒక ఫ్లైఓవర్ , నాగార్జునసాగర్ క్రాస్ రోడ్డు నుండి అమరావతి వరకు కొత్త హైవే నిర్మాణం జరగుతుందన్నారు. ఆ రూట్ కూడా ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి సాగర్ ఎక్స్ రోడ్ వైపు కూడా ఫ్లైఓవర్ నిర్మాణానికి మంజూరు చేయాలని మంత్రిని కోరారు ఈట‌ల రాజేంద‌ర్. దీనికి కూడా ఓకే చెప్పారు నితిన్ గ‌డ్క‌రీ.

Also Read : KTR Fired on Union Govt : ప‌త్తి రైతుల‌ను ఆదుకోవ‌డంలో విఫ‌లం

Exit mobile version