CM Revanth Reddy Interesting : మ‌హంకాళి అమ్మ వారికి బోనం స‌మ‌ర్పించిన సీఎం

త‌న‌తో పాటు మంత్రి కొండా సురేఖ కూడా

Hello Telugu - CM Revanth Reddy Interesting

Hello Telugu - CM Revanth Reddy Interesting

CM Revanth Reddy : హైద‌రాబాద్ – బోనాల ఉత్స‌వం కొన‌సాగుతోంది హైద‌రాబాద్ న‌గ‌ర‌మంతా. ఎక్క‌డ చూసినా బోనాలతో భ‌క్తులు ద‌ర్శ‌నం ఇస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆదివారం సికింద్రాబాద్ ల‌ష్క‌ర్ బోనాలు జాత‌ర సంద‌ర్భంగా శ్రీ ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ వారికి స్వ‌యంగా ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). అంత‌కు ముందు ఆయ‌న దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌తో క‌లిసి బోనం ఎత్తారు. వాటిని అమ్మ వారికి స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున బందోబ‌స్తును ఏర్పాటు చేశారు.

CM Revanth Reddy Visit

ఉదయం 11.00 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయానికి చేరుకున్నారు. సీఎంకు ఆల‌య మ‌ర్యాదాల‌తో పూర్ణ కుంభంతో అర్చ‌కులు స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ఆల‌యంలోకి తీసుకు వెళ్లారు. అక్క‌డ అమ్మ వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం ప‌ట్టు వ‌స్త్రాల‌ను సీఎం రేవంత్ రెడ్డి దంప‌తులు అంద‌జేశారు. అమ్మ వారికి ప్ర‌త్యేకంగా బోనం సమర్పించారు మంత్రులు కొండా సురేఖ‌, పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ప్ర‌భుత్వ విప్ అడ్లూరి ల‌క్ష్మ‌ణ్, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాద‌వ్, ఎమ్మెల్యేలు, ప్ర‌జా ప్ర‌తినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ వారికి బోనాలు స‌మ‌ర్పించం తాను పూర్వ జ‌న్మ సుకృతంగా భావిస్తున్న‌ట్లు చెప్పారు. భ‌క్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు.

Also Read : MLC Kavitha Fired on Mallanna : మల్లన్నపై మండలి చైర్మన్ కు కవిత ఫిర్యాదు

Exit mobile version